కరోనా భారిన పడిన RX100 దర్శకుడు.. రాజమౌళి బాటలోనే కీలక నిర్ణయం!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా సరిగ్గా షూటింగ్స్ కూడా మొదలవ్వలేదు. లాక్ డౌన్ మొదలైనప్పుడే షూటింగ్స్ గురించి చాల మంది ఆశలు వదులుకున్నారు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొందరు కరోనా వైరస్ భారిన పడుతున్నారు. ఇక రీసెంట్ గా ఒక యువ దర్శకుడికి కూడా కరోనా సోకింది. అయితే దర్శకుడు కూడా రాజమౌళి దారిలోనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు.

ఆర్ఎక్స్ 100 దర్శకుడికి కరోనా

ఆర్ఎక్స్ 100 దర్శకుడికి కరోనా

ఆ దర్శకుడు మరెవరో కాదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న అజయ్ భూపతి. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో అందరిని ఆకర్షించిన అజయ్ నెక్స్ట్ సినిమాను అంతకంటే హై రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా అజయ్ కొంత అస్వస్థతకు గురవ్వగా కరోనా టెస్టులు చేయించుకున్నారు. పాజిటివ్ అని నిర్దారణ కావడంతో వెంటనే ఆయన క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

బాధ్యతగా క్వారంటైన్ లోనే

బాధ్యతగా క్వారంటైన్ లోనే

సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి, బండ్ల గణేష్, డీవీవీ దానయ్య, తేజ, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, వంటి ప్రముఖులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అలాగే మరికొందరు బుల్లితెర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కి కూడా కరోనా భారిన పడ్డారు. అందరూ కూడా బాధ్యతగా క్వారంటైన్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

క్లారిటీ ఇచ్చిన అజయ్..

క్లారిటీ ఇచ్చిన అజయ్..

ఇక లేటెస్ట్ గా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కూడా కరోనా భారిన పడ్డాడు అని తెలియగానే మొదట అవి రూమర్స్ అనే టాక్ కూడా వచ్చింది. ఆ టాక్ కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుండడంతో వెంటనే అజయ్ భూపతి స్పందించాడు. కరోనా పాజిటివ్ తేలినట్లు వివరణ ఇవ్వడంతో రూమర్స్ కి బ్రేక్ పడింది.

Recommended Video

90ml Director Shekar Reddy Exclusive Interview
 రాజమౌళి బాటలోనే..

రాజమౌళి బాటలోనే..

ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వివరణ ఇచ్చారు. అయితే మూడు వారాల్లో బాడీ సెట్ అవ్వగానే కరోనా రోగుల కోసం ప్లాస్మా దానం చేయనున్నట్లు క్లారిటీ ఇవ్వగా అదే బాటలో అజయ్ భూపతి నడవడానికి సిద్ధమయ్యాడు. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా అంటూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. కరోనాతో అపాయం స్థితిలో ఉన్న వారికి ప్లాస్మా దానం చేస్తే ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రస్తుతం స్టార్స్ ప్రత్యేకంగా సందేశాలను అందిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X