సమంత కన్నా బెటర్ హీరోయిన్ కావాలంటోన్న RX100 డైరెక్టర్
RX100 సినిమాతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన అజయ్ భూపతి ఆచి తూచి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం స్కెచ్ వేస్తున్నాడు. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చినా, తాను అనుకున్నది సాధించే వరకూ ఈ యంగ్ డైరెక్టర్ నిద్రపోయేలా లేడు. ఇటీవలే శర్వానంద్ తో అజయ్ సినిమా కన్ఫామ్ అవ్వగా, ఇప్పుడు హీరోయిన్ కోసం వెతుకులాట మొదలైందని తెలుస్తోంది.
తొలుత ఈ సినిమాకోసం నాగచైతన్య, సమంతను అనుకున్నాడట అజయ్. అయితే అది వర్కౌట్ అవ్వకపోవడంతో సీన్ లోకి శర్వానంద్ ఎంటరయ్యాడని తెలుస్తోంది. ఇక లాక్ డౌన్ పుణ్యమాని స్క్రిప్ట్ పై మరింత డీప్ గా వర్క్ చేశాడో ఏమో, ఇప్పుడు శర్వాకు జోడీగా సమంతకు బదులు ఇంకో భామను వెతికే పనిలో పడ్డాడు అజయ్.

గతంలో శర్వానంద్, సమంత జంటగా నటించిన జానూ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. వాళ్లద్దరి జోడీ కూడా జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో, మరోసారి ఆ జంటను రిపీట్ చేయడంలో అర్ధం లేదని అజయ్ భావిస్తున్నాడట. కాబట్టి, ఆ ఆలోచనను డ్రాప్ చేసి ఇంకో హీరోయిన్ ను వెతుక్కోవడమే బెటర్ అని ఫిక్స్ అయ్యాడు.
అనిల్ సుంకర నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మరో ప్రముఖ నటీమణిని ఫైనలైజ్ చేసే ఆలోచనలో ఉంది చిత్ర బృందం. త్వరలోనే దీనికి సంబంధిచిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి.. శర్వాకు జోడీగా ఏ ముద్దుగుమ్మ సెట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











