రోమాలు నిక్కబొడుచుకొనేలా.. కేజీఎఫ్‌పై హీరో కార్తీకేయ సెన్సేషనల్ కామెంట్
కన్నడ రైజింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రంపై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు విశేషంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్‌పై RX 100 చిత్రంతో స్టార్ హీరోగా మారిన కార్తీకేయ స్పందించారు. ఇటీవల కేజీఎఫ్ చిత్రాన్ని వీక్షించిన కార్తీకేయ ట్వీట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే..
సౌతిండియా సెన్సేషన్ కేజీఎఫ్ చిత్రాన్ని ఇటీవల చూడటం జరిగింది. ఇటీవల రోమాలు నిక్కబొడిచుకొనేలా నేను చూసిన సినిమా ఏదైనా ఉన్నందంటే ఇదే. మీరు ఒకవేళ చూడకపోతే మిస్ కావొద్దు. యష్ సర్.. ఈ తరం హీరోలకు, డైరెక్టర్లకు మీరు స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు తలవంచి నమస్కరిస్తున్నాను అని కార్తీకేయ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

RX 100 ఘనవిజయం తర్వాత కార్తీకేయ హీరోగా బిజీగా మారిపోయారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న హిప్పీ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి థాను రూపొందిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది.
ఇటీవల కార్తీకేయ నటిస్తున్న మరో చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని అనిల్ కడియాలా, తిరుమల్ రెడ్డి నిర్మిస్తుండగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ సినిమాటోగ్రఫిని, చేతన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











