విజయ దేవరకొండ TDFకు అండగా హీరో కార్తికేయ.. డార్లింగ్ బిగ్ హగ్ అంటూ రౌడీ ట్వీట్
కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ అనంతర పరిస్థితుల గురించి సినీ హీరో విజయ్ దేవరకొండ దృష్టిపెట్టారు. లాక్‌డౌన్ తర్వాత యువతకు ఉపాధి అంశాలు, మధ్య తరగతి ప్రజలు, పేదవాళ్లను ఆదుకోనేందుకు రెండు రకాల ప్రతిపాదనలతో ముందుకొచ్చారు. ది దేవరకొండ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా సేవలు అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. అందుకోసం తొలుత రూ.1 కోటి నిధిని ప్రకటించారు. హీరో విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన The Deverakonda Foundation (TDF) విరాళాలు అందించేందుకు పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.
ఈ క్రమంలోనే సినీ హీరో, RX100 కార్తికేయ తన వంతుగా రూ.1 లక్ష విరాళం ప్రకటించారు. మిడిల్ క్లాస్ ఫండ్ కోసం తన శక్తిమేరకు అండగా ఉండాలని నిర్ణయించుకొన్నాను అని కార్తీకేయ తెలిపారు. ఇలాంటి సమయంలో ఎలాంటి భేషజాలు, విభేదాలు, ఇగోలకు తావు లేకుండా అందరూ కలిసి ముందుకు నడువాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులు మధ్య తరగతి ప్రజలను, యువతను నిరాశ, నిస్పృహలకు లోను చేసే విధంగా ఉంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అని హీరో కార్తికేయ ఓ ప్రకటనలో తెలిపారు.

కార్తికేయ అందించిన విరాళంపై విజయ్ దేవరకొండ స్పందించారు. డార్లింగ్ అదరగొట్టావు.. MCFకు నీవు అందించిన సహాయం వల్ల దాదాపు 100కుపైగా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవచ్చు, నీకు బిగ్ హగ్ అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు
TDF మిడిల్ క్లాస్ ఫండ్ ఉద్దేశం ఏమిటంటే..
కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఎవరికైనా అత్యవసర సహాయం కావాలంటే www.the deverakonda foundation. org వెబ్ సైట్ లో మీ వివరాలు తెలియజేస్తే మా "ది మిడిల్ క్లాస్ ఫండ్" నుండి మీకు సహాయం అందుతుంది. ప్రభుత్వం నుండి లబ్ది పొందలేని వారు, రేషన్ కార్డ్ లేని వారు ఈ హెల్ప్ తీసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రలోని ఎవరైనా త్వరితగతిన సహాయం కావాలనుకున్నవారు దీన్ని పొందవచ్చు. లాక్ డౌన్ కారణంగా మా టీమ్ మీ ఇంటిదగ్గరికి వచ్చి హెల్ప్ చెయ్యలేదు కావున, మీరు మీ ఇంటిదగ్గరే ఉన్న షాప్‌లో సరుకులు కొనవచ్చు, ఆ బిల్ ను మేము "ది మిడిల్ క్లాస్ ఫండ్" నుండి చెల్లిస్తాం" అని తెలిపారు


Click it and Unblock the Notifications











