RX 100 హిందీ రీమేక్.. హీరో, దర్శకుడు ఎవరో తెలుసా?
బాలీవుడ్‌కు మరో యువ హీరో పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ నటుడు సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. తెలుగులో ఘన విజయం సాధించిన RX 100 చిత్ర రీమేక్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం కాబోతుండటం విశేషం. తెలుగు కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.
హిందీలో RX 100 సినిమా రీమేక్‌కు దర్శకుడు మిలాన్ లూథరియా దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. త్వరలోనే RX 100 చిత్ర రీమేక్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు ప్రముఖ ట్రేడ్ అనలిస్టు, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మిలాన్ మాట్లాడుతూ.. RX 100 లాంటి సినిమాకు దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఆహన్ శెట్టిని హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం మరింత ఉత్సాహంగా ఉంది. సాజిద్ నిర్మాతగా ఉండటం ఏ దర్శకుడికైనా పాజిటివ్ అంశం. ఎప్పుడెప్పుడూ సినిమా మొదలుపెడుదామా అనే అతృత, ఆసక్తి నాలో పెరిగింది అని అన్నాు.

సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ది డర్డీ పిక్చర్, వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, కచ్చే ధాఘే, బాద్షాహో చిత్రాలకు మిలాన్ లూథరియా దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











