15 నిమిషాల్లో నీ ఎరక్షన్ కట్... ఆర్ఎక్స్ 100 హీరోకు షాకిచ్చిన హీరోయిన్!

Recommended Video

RX 100 Hero Karthikeya's Hippi Trailer Released || Filmibeat Telugu

'ఆర్ఎక్స్ 100' సినిమా విజయంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొత్త కుర్రాడు కార్తికేయ... మరో రొమాంటిక్ డ్రామాతో యువతను ఎంటర్‌టైన్ చేయబోతున్నాడు. టిఎన్ కృష్ణ దర్శకత్వంలో త్వరలో 'హిప్పి' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా... తాజాగా 'మహర్షి' మూవీతో పాటు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. గతంలో విడుదలైన టీజర్లో ముగ్గురు అమ్మాయిలతో హీరో జల్సాలు చేయడం చూపించారు....తాజా ట్రైలర్లో అమ్మాయిలు జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కష్టాలు మొదలవుతాయో చూపించే ప్రయత్నంచేశారు.

అమ్మాయిలు లవ్ చేయడం మొదలు పెడితే స్వర్గం దూరం అవుతుంది

అమ్మాయిలు లవ్ చేయడం మొదలు పెడితే స్వర్గం దూరం అవుతుంది

జాన్ మిల్టన్ ముందే చెప్పాడు... ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే స్వరం మొదలవుతుంది. అదే అమ్మాయి మనల్ని తిరిగి లవ్ చేయడం మొదలు పెడితే మనకు స్వర్గం దూరం అవుతుంది అంటూ హీరో చెప్పే డైలాగులతో ట్రైలర్ మొదలైంది.

నీ ఎరక్షన్ కట్...

నీ ఎరక్షన్ కట్...

మిథైల్ బ్రొమైడ్ అనే పేరు విన్నావా? అది నువ్వు తింటున్న చాక్లెట్ మీద స్ప్రే చేశాను. అది తిన్న 10 నిమిషాల తర్వాత తల తిరిగినట్లు అనిపిస్తుంది, 15 నిమిషాలకు నీ ఎరక్షన్ కట్ అవుతుంది... అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ ట్రైలర్లో హైలెట్ అయింది.

అమ్మాయిలను చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా?

అమ్మాయిలను చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా?

అమ్మాయిలను చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా? వారు ఒక్కొక్క దినం ఒక్కో మాదిరిగా ఉంటారు. ఒకదినం ఎమోషన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక దినం ఎమోషన్స్ తక్కువ ఉంటుంది. చందమామ ఆకాశానికి అందం, అమ్మాయిలు జిందగీకి బంధం... అంటూ జెడీ చక్రవర్తి చెప్పే డైలాగ్స్ సూపర్బ్ అనేలా ఉన్నాయి.

 అది వేటపోతు కాదు.. వేట కత్తి

అది వేటపోతు కాదు.. వేట కత్తి

దేవుడు వేటపోతును పుట్టించిందే బిర్యానీ కోసం.. ఆ బిర్యానీ నీకు రోజూ దొరుకుతుంటే తిని హ్యాపీగా ఉండొచ్చుకదరా అంటూ అమ్మాయిలను ఉద్దేశించి జేడీ చక్కవర్తి వ్యాఖ్యానించగా.... ‘అది వేటపోతుకాదు బాస్, వేట కత్తి' అంటూ కార్తీకేయ ఇచ్చే రియాక్షన్ ‘హిప్పి' మూవీ కాన్సెప్ట్ ఏమిటో స్పష్టం చేస్తోంది.

హిప్పి

కార్తికేయ సరసన దిగాంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టి.ఎన్‌.కృష్ణ ద‌ర్శ‌కత్వంలో వి క్రియేష‌న్స్ , ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.డి. రాజ‌శేఖ‌ర్, సంగీతం: నివాస్ కె.ప్ర‌స‌న్న, ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ కె.ఎల్‌, స్టంట్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X