‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడి నెక్ట్... మల్టీ స్టారర్ మాఫియా థ్రిల్లర్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో సంచలన విజయం నమోదు చేసిన నూతన దర్శకుడు అజయ్ భూపతి తన తర్వాతి ప్రాజెక్టుకు రెడీ అవుతున్నాడు. రెండో సినిమాకే ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు స్టార్ రామ్ పోతినేని, మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో ఈ మూవీ రూపొందబోతోంది.
అజయ్ భూపతి చెప్పిన కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అయితే దుల్కర్‌కు కథ వినిపించాల్సి ఉందని సమాచారం. దుల్కర్ సల్మాన్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే అక్టోబర్లో సినిమా లాంచ్ చేసి... నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని రామ్ పెదనాన్న శ్రవంతి రవికిషోర్ నిర్మించబోతున్నారు.

మాఫియా థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, వైజాగ్ బ్యాక్ డ్రాపుతో కథ నడుస్తుందని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన అజయ్ భూపతి ఇపుడు తన గురువును ఫాలో అవుతూ మాఫియా నేపథ్యం ఉన్న సినిమా ఎంచుకోవడం చర్చనీయాంశం అయింది.
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'ఆర్ఎక్స్ 100' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. కేవలం రూ. 3 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ. 25 కోట్లు వసూలు చేసింది. కంటెంట్ సాలిడ్‌గా ఉండటంతో... కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు అయినప్పటికీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.


Click it and Unblock the Notifications











