Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
S Originals న్యూ ఇయర్ జోష్.. 2022లో 9 సినిమాలతో నిర్మాత సృజన్ యరబోలు
చిన్న చిత్రమైనా, భారీ బడ్జెట్ చిత్రమైనా కంటెంట్ బాగుంటే విశేషంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే విషయం ఇటీవల కాలంలో స్పష్టమైంది. కేవలం కంటెంట్‌ను నమ్ముకొని, యువ దర్శకులకు ప్రోత్సాహం అందిస్తున్న నిర్మాత సృజన్ యరబోలు. ఆయన స్థాపించిన ఎస్ ఓరిజినల్స్ బ్యానర్ నుంచి ఏకంగా ఈ ఏడాది 9 చిత్రాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. నూతన సంవత్సరంలో తమ సంస్థ నుంచి రాబోతున్న సినిమాల గురించి నిర్మాత సృజన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..
కొత్త దర్శకులతో విభిన్నమైన చిత్రాలను రూపొదిస్తున్నాం. ఈ ఏడాది నిర్మాణ రంగంలో యస్ ఓరిజినల్ ప్రత్యేకతను చాటుకోబోతున్నది. యస్ ఓరిజినల్స్‌ను టాలీవుడ్‌లో విశిష్టమైన స్థానంలో నిలుపాలన్నదే నా కోరిక. ఇప్పటి వరకూ కొన్ని సినిమాలను పార్ట్‌నర్‌షిప్‌లో నిర్మించడం జరిగింది. కానీ యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుంచే 2022లో 9 సినిమాలు రిలీజ్ చేయబోతున్నాం. మా బ్యానర్ నుంచి కొత్త దర్శకులు పరిచయం కాబోతున్నారు. టాలెంట్‌పై నమ్మకంతో వారిని ప్రోత్సహించడం జరిగింది అని సృజన్ తెలిపారు.

బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న పంచతంత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దంగా ఉంది.
యూత్‌ను విశేషంగా ఆకట్టుకొంటున్న సంతోష్ శోభన్ హీరోగా, ఎమ్ ఆర్ ప్రొడక్షన్‌తో సుభాష్ దర్శకునిగా పరిచయం చేస్తూ ఒక అందమైన ప్రేమకథను రూపొందించాం. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రోడక్షన్ పనులలో ఉంది.
సుమంత్ హీరోగా రూపొందుతన్న అహాం సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ జరుగుతుంది అని సృజన్ తెలిపారు.
నూతన దర్శకుడు బ్రిజేష్ దర్శకత్వంలో వైరల్ చిత్రం, అలాగే బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది ఈ సినిమా తో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు అని సృజన్ తమ ప్రాజెక్టుల వివరాలు వెల్లడించారు.

గతం
సినిమాతో
విమర్శకుల
ప్రశంసలు
పొందిన
కిరణ్
దర్శకత్వంలో
అదే
టీంతో
మరో
సినిమా
రూపొందిస్తున్నాం.
ఆ
సినిమా
షూటింగ్
చివరి
దశలో
ఉంది.
వీటితో
పాటు
కన్నడంలో
బీర్బల్
ట్రియాలజీ
తీసిన
దర్శకుడు
శ్రీని
దర్శకత్వంలో
ఓల్డ్
మంక్
అనే
సినిమాని
రూపొందిస్తున్నాం.
మూవీ
షూటింగ్
పూర్తయింది.
కొత్త దర్శకుడు విష్ణు దర్శత్వంలో మళయాళంలో రూపొందుతున్న నైనా లో 96 మూవీ ఫేమ్ గౌరి కిషన్ లీడ్ రోల్ చేస్తుంది. బాలీవుడ్ పాపులర్ రైటర్స్ సిద్దార్ధ , గరీమ దర్శకత్వంలో రూపొందున్న దుకాన్ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ లలో ఉంది. ఈ చిత్రాలన్నీ 2022లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని నిర్మాత సృజన్ యరబోలు తమ బ్యానర్ భవిష్యత్ కార్యాచరణను తెలిపారు.