ఫేమస్ కమెడియన్‌పై రాజమౌళి కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా..?
దర్శక ధీరుడు రాజమౌళి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ టాలీవుడ్ నటీనటులకు, దర్శక నిర్మాతలకు ప్రోత్సాహం అందిస్తుంటారు. టీజర్, ట్రైలర్, సినిమా ఏదైనా సరే తనకు నచ్చితే వెంటనే ట్విట్టర్ వేదికగా వారిని అభినందిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలిపారు జక్కన్న.
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు అనే సినిమా ద్వారా దర్శక నిర్మాతగా మారుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో పలువురు సెలెబ్రిటీలు శ్రీనివాస్ రెడ్డిని మెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నేను కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పటి నుండి శ్రీనివాసరెడ్డి నాకు తెలుసు. తను మంచి కమెడియన్. తొలిసారి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమాతో దర్శక నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలుపుతున్నాను అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది.
ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. జయమ్ము నిశ్చయమ్మురా రచయిత పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లేను అందించారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











