నా మనసులో అనుష్క.. రవితేజతో రొమాంటిక్ సీన్స్.. తప్పలేదు మరి: రాజమౌళి కామెంట్స్
'సూపర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క.. సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తూ సూపర్ సక్సెస్ సాధించింది. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన 15 సంవత్సరాల సినీ జర్నీ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 15 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అనుష్క గురించి రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వివరాల్లోకి పోతే..

పదిహేనేళ్ల ప్రయాణం.. ప్రముఖులంతా హాజరు
2005 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క.. తన 15 సంవత్సరాల వెండితెర ప్రయాణం పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 15 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, రాఘవేంద్ర రావు, పూరి జగన్నాథ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

స్పెషల్ అట్రాక్షన్.. రాజమౌళి స్పీచ్
ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన రాజమౌళి.. అనుష్క టాలెంట్ ఏంటి? ఆమెతో తన రిలేషన్ ఎలాంటిదనే విషయాన్ని చెప్పుకొచ్చారు. అనుష్కతో విక్రమార్కుడు, బాహుబలి లాంటి భారీ హిట్స్ రూపొందించారు జక్కన్న. అందుకే అనుష్క గురించి ఆయన మాట్లాడిన తీరు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఆమెతో ఆ రోల్.. గర్వంగా ఉంది
అనుష్క చాలా మంచి అమ్మాయని చెప్పిన రాజమౌళి.. ఆమె తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. స్వీటీ ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తుందని అన్నారు. ఆమెతో బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర క్రియేట్ చేసినందుకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు.

రవితేజతో రొమాంటిక్ సీన్స్.. తప్పలేదు మరి
స్వీటీతో తనకు వచ్చిన ఇబ్బంది ఒక్కటే అని.. ప్రతీ షాట్ చేసి చూపించమని అంటుందని రాజమౌళి చెప్పారు. విక్రమార్కుడు సినిమా చేస్తున్నపుడు ప్రతి షాట్ అలానే చేసి చుపించానని, అయితే రవితేజతో ఉన్న రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించమనేదని అన్నారు జక్కన్న.

నా మనసులో స్వీటీకి ప్రత్యేక స్థానం
ఇకపోతే విక్రమార్కుడు టైమ్‌లోనే తనకు అనుష్క బాగా క్లోజ్ అయిందని రాజమౌళి అన్నారు. అప్పటినుంచే మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయిందని తెలిపారు. కొంత మందిని ప్రేమిస్తాం.. మరికొంత మందిని ఇష్టపడతాం.. కానీ స్వీటీని మాత్రం ఒక యాక్టర్‌గా, అలాగే ఒక మంచి మనసున్న మనిషిగా నేను ఎంతో గౌరవిస్తానని అన్నారు. తన మనసులో స్వీటీకి ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
Recommended Video


'నిశ్శబ్దం'గా అనుష్క
ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్, షాలినీ పాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ పతాకాలు సంయుక్తంగా ఈ సినిమాను సమర్పిస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











