మన్మథుడికి దర్శక ధీరుడి కితాబు.. టీజర్ చూసిన రాజమౌళి వెంటనే
గతంలో వచ్చిన మన్మథుడు సినిమా ఇన్‌స్పిరేషన్‌తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా కీర్తి సురేష్, సమంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

కాగా ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ లాంటి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వని చిత్ర యూనిట్.. ఈ రోజు మన్మథుడు 2 టీజర్ రిలీజ్ చేసి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. నాగార్జున లోని మన్మథుడిని మరోసారి బయటకు తీస్తూ టీజర్ కట్ చేసిన విధానం అబ్బురపరుస్తోంది. ''నీకు షెట్టర్లు దించేసి దుకాణం మూసే వయసొచ్చింది. ఈ వయసులో మీకు పెళ్లేంటి? ఎండి పోయిన చెట్టకు నీళ్లు పోస్టే మళ్లీ పూలు పూస్తాయా? పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన టైమ్ లో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంటి?'' అంటూ నాగార్జునను ఉద్దేశించి వేసిన పంచ్ డైలాగులు టీజర్లో హైలైట్ అవుతున్నాయి. ఇక నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య వచ్చిన రొమాంటిక్ సన్నివేశాలు టీజర్ కి ప్రాణం పోశాయి.
మొత్తానికి కేవలం టీజర్ ద్వారానే సంచలనాలకు నాంది పలికాడు అక్కినేని నాగార్జున. ఇక ఈ టీజర్ చూసిన టాలీవుడ్ ప్రముఖులు నాగార్జునపై, మన్మథుడు 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ టీజర్ పై స్పందించడం మన్మథుడు 2 టీమ్‌కి స్పెషల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఈ టీజర్ చూసిన జక్కన్న.. 'మన్మథుడు లుకింగ్ ప్రెట్టీ.. నాగార్జున స్మాషింగ్ ఎప్పటికీ.. సూపర్ టీజర్' అంటూ ట్వీట్ పెట్టారు. అతి త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు మన్మథుడు 2 టీమ్ సభ్యులు.


Click it and Unblock the Notifications











