Don't Miss!
- News
Lady: ప్రతీకారం, 58 ఏళ్ల ఆంటీని రేప్ చేసి చంపేసిన 16 ఏళ్ల అబ్బాయి, పగతో ప్రైవేట్ పార్ట్స్ ను వదల్లేదు !
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పవన్ సినిమా నుంచి తప్పుకున్న సాయి పల్లవి: క్లారిటీ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్
రీఎంట్రీలో ఫుల్ జోష్‌ను ప్రదర్శిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కమ్‌బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' పట్టాలపై ఉండగానే వరుసగా పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న అతడు.. ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తున్నాడు. అయితే, అన్నిటి కంటే చివరిగా ప్రకటించిన సినిమాను మాత్రం ముందుగానే మొదలెట్టాడు. అదే మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానాతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు పవన్. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు సాగర్‌ను ఫిల్మీబీట్ వివరణ కోరగా.. ఆయన ఈ వార్తలను ఖండించారు. బయట ప్రచారం అవుతున్నట్లు సాయి పల్లవి ఈ సినిమా నుంచి తప్పుకోలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లైంది.

'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌ను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. సాయి పల్లవితో పాటు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా చేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు అందిస్తుండటంతో పాటు, దర్శకత్వ పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ మూవీకి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో సముద్రఖని కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమస్ సంగీతం సమకూర్చుతున్నాడు.