అందుకే ‘సాహో’ రిలీజ్ వాయిదా వేశాం: నిర్మాతల ప్రకటన
ఇండియా మొత్తం 2019లో ఎదురు చూస్తున్న అతిపెద్ద మూవీ 'సాహో'. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలో ఓ రేంజిలో ఉన్నాయి. అందుకు తగిన విధంగానే రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యూవి క్రియేషన్స్ వారు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ బిగ్ మూవీని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల రిలీజ్ డేట్ ఆగస్టు 30కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని భావించామని, పోస్ట్ ప్రొడక్షన్ మరింత క్వాలిటీగా రావాలనే ఉద్దేశ్యంతో రిలీజ్ డేట్ వాయిదా వేసినట్లు తెలిపారు.

ఈ మూవీని ప్యాన్ ఇండియా వైడ్ ఆగస్ట్ 30 గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు భారతీయ సినీ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయని తెలిపారు. అబుదాబిలో చిత్రీకరించిన 8 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ మొత్తానికి హైలెట్ అయ్యేలా ఉంటుందన్నారు.
'సాహో' చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎవలీన్ శర్మ లాంటి బాలీవుడ్ తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన యాక్షన్ సినిమాలు అన్నింటినీ మించి పోయేలా ఈ చిత్రం ఉంటుందట.


Click it and Unblock the Notifications











