సాహో సెన్సార్ రిపోర్టు: సినిమా నిడివి ఎంతో తెలుసా?
దేశ సినీ రంగంలో సెన్సేషనల్ మూవీగా తెరకెక్కిన చిత్రం సాహో. ఈ చిత్రం రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. గతేడాది దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద తెరకెక్కించిన యాక్షన్ సీన్ల కోసమే రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వార్తలు రావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసాయి. కేవలం ఇంటర్వెల్ సీన్ కోసమే రూ.30 కోట్లు ఖర్చు చేశారనేది సినీ వర్గాలు టాక్. ఇలా సెన్సేషనల్ వార్తలతో నేషనల్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన శ్రద్ధాకపూర్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది.

అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసున్న సాహో చిత్రం శుక్రవారం సెన్సార్ పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో రిలీజ్ మార్గం సుగమమైంది. సెన్సార్ సర్టిఫికెట్ అందిన క్రమంలో త్వరలోనే సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సెన్సార్ బోర్డు అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం సాహో నిడివి 171.52 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంటలపాటు. అత్యంత సాంకేతిక విలువలతో హలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా రూపొందిన ఈ చిత్రం అభిమానులకు పండుగ వాతావరణం తెచ్చే పరిస్థితి ఉంది. రిలీజ్‌కు ముందు దక్షిణాదిలో భారీగా ప్రభాస్, శ్రద్దాకపూర్ ప్రమోషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











