మెగా కమర్షియల్.. సాహో దర్శకుడిని కూడా చెడగొట్టేస్తున్నారా?

ప్రస్తుత జనరేషన్ కి తగ్గట్లుగా సినిమాలు చేస్తున్న కొంత మంది యువ దర్శకులు స్టార్ హీరోలను బాగానే ఆకర్షిస్తున్నారు. డిఫరెంట్ కథలతో మునుపెన్నడు చూడని విధంగా స్క్రీన్ ప్లేతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు. అయితే కొంతమంది దర్శకులు కొన్ని హిట్స్ వచ్చిన తరువాత రొటీన్ గా కమర్షియల్ యాంగిల్ లోనే సినిమాలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మరో దర్శకుడు కూడా స్టార్ హీరో కోసం తన స్టైల్ ని పూర్తిగా మార్చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రన్ రాజా రన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు సుజిత్ ఆ తరువాత ఎవరు ఊహించని విధంగా ప్రభాస్ తో సాహో సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా దర్శకుడి మేకింగ్ ఓ వర్గం ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సుజిత్ టాలెంట్ ని గమనించిన మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ బాధ్యతలను అతనికి అప్పగించాడు.

Saaho director sujeeth creating commercial script for megastar

ఇప్పటికే తన స్టైల్ వెర్షన్ ని రెడీ చేసుకున్న సుజిత్ మెగాస్టార్ ని మెప్పించలేకపోయారట. ఆయన క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని కొన్ని మేజర్ చేంజెస్ చేయాలని మెగా టీమ్ కోరడంతో సుజిత్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని బలవంతంగా యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ నటించిన లుసిఫర్ సినిమాలో హీరోయిన్ లేదు. పైగా హీరో మధ్యవయస్కుడిగా కనిపించారు.

ఇక మెగాస్టార్ విషయానికి వచ్చేసరికి ఆ విషయాల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉందట. కాజల్ ని కాసేపు మెగాస్టార్ పక్కన చూపించాలని అలానే కమర్షియల్ యాంగిల్ లో కామెడీ, డ్యాన్స్ వంటి వాటికి సినిమాలో కనిపించేలా సుజిత్ కథను మళ్ళీ మారుస్తున్నారట. మొత్తంగా సాహో దర్శకుడు కూడా కమర్షియల్ లెక్కలకు అలవాటు పడక తప్పడం లేదన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X