ఆసుపత్రి పాలైన ‘సాహో’ దర్శకుడు సుజీత్

చిన్న వయసులోనే 'సాహో' లాంటి బిగ్ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాను హ్యాండిల్ చేయడం ద్వారా హాట్ టాపిక్ అయ్యాడు సుజీత్. ఆగస్టు 30న విడుదలన ఈచిత్రం మిక్డ్స్ రివ్యూలు సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్లు వసూలు చేసింది.

'సాహో' రిలీజ్ తర్వాత దర్శకుడు సుజీత్ మీడియా ముందుకు రాలేదు. రిలీజ్ ముందు కూడా ఆయన ప్రమోషన్లలో పెద్దగా పాల్గొనలేదు. ప్రభాస్ ఒక్కడే హ్యాండిల్ చేశాడు. అయితే రిలీజ్ తర్వాత సుజీత్ ఎందుకు ఇంటికే పరిమితం అయ్యాడనే విషయం వెల్లడైంది.

డెంగీతో బాధపడుతున్న

డెంగీతో బాధపడుతున్న

కొన్ని రోజులుగా సుజీత్ జ్వరంతో బాధపడుతున్నాడు. ‘సాహో' రిలీజ్ తర్వాత ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేక పోవడంతో ఇంటి వద్దే ఉండి చికిత్స తీసుకున్నాడు. అయితే పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది. ఆయన డెంగీతో బాధపడుతున్నట్లు సమాచారం.

శనివారం ఆసుపత్రిలో చేరిన సుజీత్

శనివారం ఆసుపత్రిలో చేరిన సుజీత్

మీడియా రిపోర్ట్స్ ప్రకారం శనివారం ఉదయం ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వైద్యలు చికిత్స అందిస్తున్నారని, ఆయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని స్పష్టమవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన సుజీత్

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన సుజీత్

‘సాహో' సినిమాకు సంబంధించిన పనుల్లో పడి సుజీత్ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడట. కొన్ని రోజుల ముందే ఆయన ఆసుపత్రిలో చేరి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందట.

‘సాహో' విమర్శలతో

‘సాహో' విమర్శలతో

‘సాహో' రిలీజ్ తర్వాత విమర్శలు రావడంతో ఆయన కాస్త మానసిక వేదనక గురయ్యారని, ఆయన ఆరోగ్యం క్షీణించడానికి ఇది కూడా ఒక కారణమని అంటన్నారు. అయితే ప్రభాస్, సాహో నిర్మాతలు మాత్రం ఈ కుర్ర దర్శకుడికి పూర్తి మద్దుతుగా ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X