Saaho movie first talk: బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్.. ప్రభాస్, శ్రద్దా టెర్రిఫిక్
2019లో అత్యంత ఆసక్తితో ప్రేక్షకులు ఎదురు చూసిన చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో భారీగా అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో రూపొందించడం, రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడంతో సినిమా మరోస్థాయి అనే మాట వినిపించింది. ఇలాంటి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మూవీ గురించి సోషల్ మీడియా, మీడియాలో ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..
Read in English: Saaho Twitter Review: Here's What Fans Feel About The Prabhas Starrer

అత్యున్నత సాంకేతికతతో
టాలీవుడ్, బాలీవుడ్ స్థాయిని మించిన సినిమా సాహో. అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కింది. సుజిత్ స్టైలిష్ మేకింగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రభాస్ యాక్షన్ సీన్స్, శ్రద్దాకపూర్ యాక్టింగ్ సినిమాకు హైలెట్. భారతీయ సినిమాలో అతిపెద్ద యాక్షన్ బ్లాక్‌బస్టర్ అనే టాక్ వినిపిస్తున్నది.

థ్రిల్లింగ్‌గా, గ్రిప్పింగ్‌గా
సినిమా రిలీజ్‌కు ముందు వచ్చిన ప్రతికూలతను సాహో సునాయసంగా ఎదురించిందనే మాట గట్టిగా వినిపిస్తున్నది. యాక్షన్ సీన్లలో థ్రిల్లింగ్ మూమెంట్స్, గ్రిప్పింగ్‌గా ఉండే స్క్రీన్ ప్లే, కారు రేసింగ్స్, చేజింగ్స్ సినిమాకు అదనపు ఆకర్షణ. తెలుగు ప్రేక్షకులకు సాహో కొత్త అనుభూతిని కలిగించడం ఖాయం అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తున్నది.

హై ఓల్టేజ్ ఫెర్ఫార్మెన్స్
ప్రభాస్ హై ఓల్టేజ్ ఫెర్ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టింది. బాహుబలి తర్వాత సాహోను ఎంపిక చేసుకోవడంలో ప్రభాస్ సరైన నిర్ణయం తీసుకొన్నాడు. ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరో అనడానికి సాహో 100 శాతం కరెక్ట్. శ్రద్ధాకపూర్ గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా టెర్రిఫిక్ అంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు.

ఇప్పటి వరకు చూడని
రన్ రాజా రన్ ఫేం డైరెక్టర్ సుజిత్ రెడ్డి సాహోకు దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రం ద్వారా శ్రద్దాకపూర్ తెలుగు, దక్షిణాది సినిమాకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. నీల్ నితిన్ ముఖేష్ విలన్ పాత్రలో ఆకట్టుకొన్నారు. భారతీయ సినిమా తెరపై ఇప్పటి వరకు చూడని సరికొత్త, హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని సాహో ఫస్ట్ టాక్ సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











