రోమేనియా వెళుతున్న ప్రభాస్, ‘సాహో’ టీమ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. దబాయ్, అబుదాబిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తయిన తర్వాత... ఫైనల్ షెడ్యూల్ రొమేనియాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సీన్ల, పాటలు చిత్రీకరింసచేందుకు ప్లాన్ చేస్తున్నారట. రొమేనియా షెడ్యూల్‌తో షూటింగ్ చివరి దశకు చేరుకుంటుందిన టాక్.

యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్ సినిమా కావడంతో బాలీవుడ్ మార్కెట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకే శ్రద్ధాకపూర్‌ను హీరోయిన్‌గా, జాకీష్రాఫ్‌ను, ఎవలీన్ శర్మ ముఖ్యపాత్ర కోసం ఎంపిక చేశారు. నీల్ నితిన్ ముఖేష్‌ను విలన్‌గా ఎంపిక చేశారు. వీరితో పాటు సౌత్ యాక్టర్లు అరుణ్ విజయ్, వెన్నెల కిషోర్ కూడా నటిస్తున్నారు. 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











