ఇండియాలోని నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలుకొట్టే దిశగా... ‘సాహో’ ప్రీ రిలీజ్ బిజినెస్!

Recommended Video

Saaho Pre Release Business Details || Prabhas || Filmibeat Telugu

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మరో భారీ చిత్రం 'సాహో'. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. బిజినెస్ పరంగా ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన నాన్-బాహుబలి చిత్రాలన్నింటినీ అధిగమించేలా కనిపిస్తోంది.

ఇప్పటి వరకు ఇండియాలో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం 'బాహుబలి-2'. మొదటి భాగం 'బాహుబలి' మంచి విజయం సాధించడంతో రెండో భాగానికి వరల్డ్ వైడ్ రూ. 350 కోట్ల బిజినెస్ జరిగింది. బాహుబలి హీరో కావడం, ప్రభాస్‌కు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉండటంతో 'సాహో' చిత్రానికి రూ. 255 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఏపీ, తెలంగాణ నుంచి భారీ ఎక్స్‌పెక్టేషన్స్

ఏపీ, తెలంగాణ నుంచి భారీ ఎక్స్‌పెక్టేషన్స్

ఏపీ నుంచి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అన్ని ఏరియాలకు కలిపి రూ. 80 నుంచి రూ. 85 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణ(నైజాం)లో రూ. 35 నుంచి రూ. 40 కోట్ల బిజినెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారట. రెండు ఏరియాలకు కలిపి కనీసం రూ. 115 నుంచి 120 కోట్లు అంచనా వేస్తున్నారట నిర్మాతలు.

అంత భారీ మొత్తం సాధ్యమేనా?

అంత భారీ మొత్తం సాధ్యమేనా?

ప్రభాస్ గత చిత్రం ‘బాహుబలి 2' తెలుగు రాష్ట్రాల్లో రూ. 197 కోట్లకుపైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో' చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా రూ. 120 కోట్ల బిజినెస్ సాధ్యమే అంటున్నారు. ఇది భారీ బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాతలు కూడా ఇంతకు మించి తగ్గడానికి సిద్ధంగా లేరట.

సాహో ఓవర్సీస్ రైట్స్

సాహో ఓవర్సీస్ రైట్స్

‘సాహో' చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ కూడా ఆల్రెడీ అమ్ముడయ్యాయి. రూ. 42 కోట్లకు రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది. ఒక సౌతిండియా సినిమాకు ఓవర్సీస్ మార్కెట్లో ఇంత రేటు పలకడం ఇదే తొలిసారి. ఇది కేవలం తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి తీసిన చిత్రం కాదు... హిందీ, తమిళం, మలయాళం ప్రేక్షకుల్లోనూ సినిమాపై భారీ అంచనాలు ఉండటమే ఇంత రేటు రావడానికి ప్రధాన కారణం.

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. కర్నాటక రైట్స్ రూ. 27కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియా రైట్స్ రూ. 50 కోట్ల ధర పలికి నట్లు సమాచారం. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కలిపి రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందట.

రూ. 300 కోట్ల బడ్జెట్ రికవరీ ఎలా?

రూ. 300 కోట్ల బడ్జెట్ రికవరీ ఎలా?

‘సాహో' చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారు. థిట్రికల్ రైట్స్ ద్వారా రూ. 255 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. శాటిలైట్ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, ఆడియో రైట్స్... ఇలా అన్ని కలిపి రూ. 300 కోట్ల పైచిలుకు అవసూలయ్యేలా ప్లాన్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X