‘సాహో’ కోసం 4 సంవత్సరాలు రోజుకు 20 గంటలు కష్టపడ్డారు: రాధాకృష్ణ
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. దాదాపు లక్షమంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు.
Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ సందర్భంగా ప్రభాస్‌తో తర్వాతి సినిమా చేయబోతున్న దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ... సాహో ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ. ఇది మా ఓన్ మూవీ కాబట్టి ఎక్కువగా చెప్పలేం. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. 4 సంవత్సరాల నుంచి రోజుకు 20 గంటలు కంటిన్యూగా కష్టపడ్డారు. నిర్మాతల పాషన్‌కు తల వంచి నమస్కరిస్తున్నాను. సుజీత్ ఎంతో మంది యంగ్ డైరెక్టర్లకు స్పూర్తి అని వ్యాఖ్యానించారు.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
నటీనటులు.. రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీషరఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు..


Click it and Unblock the Notifications











