సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌: అభిమానులకు కిక్కిచ్చిన సుమ, హేమంత్

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు.

Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్

మిరిమిట్లు గొలిపే ఏర్పాట్ల నడుమ వేదికపై యాంకర్స్ సుమ, హేమంత్ సందడి క్రియేట్ చేశారు. ప్రభాస్ అభిమానులతో ముచ్చటిస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రభాస్ సినిమాల గురించిన ప్రశ్నలు అడుగుతూ అవి చెప్పిన వారికి హేమంత్ చేతికి ఉన్న వాచ్ గిఫ్ట్ ఇస్తానని తనదైన స్టైల్‌లో సందడి చేసింది సుమ. ఊహించిన దానికి మించి అభిమానులు వేదిక వద్దకు రావడంతో వారిని కట్టడి చేయడం ఒకింత పోలీసులకు శక్తికి మించిన పని అయింది.

Saaho Pre Release Event: Suma and Hemanth Host the show

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Saaho Pre Release Event: Suma and Hemanth Host the show

చిత్రంలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సరసన శ్రధ్ధాక‌పూర్‌ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X