బాహుబలి బాటలోనే సాహో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.
ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్ ట్రైలర్, న్యూ పోస్టర్స్ ద్వారా ప్రేక్షక లోకంలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ రేంజ్ లో జరుగనుంది? ఎక్కడ జరగనుంది? ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారు? అనే దానిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెర దించుతూ తాజాగా సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబందించిన వివరాలు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

సాహో ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఈ ఆదివారం (ఆగస్టు 18) సాయంత్రం 5 నుంచి జరగనుందని పేర్కొన్నారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారనే దానిపై మాత్రం సమాచారం ఇవ్వలేదు. గతంలో బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరిగింది. దీంతో ఇప్పటినుంచే బాహుబలి బాటలో సాహో వెళ్తోంది అనే టాక్ మొదలైంది జనాల్లో.


Click it and Unblock the Notifications











