అఫీషియల్: ప్రభాస్ ‘సాహో’ రిలీజ్ డేట్ ఖరారు... ముందస్తు హెచ్చరికా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15, 2019లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 9 నెల ముందే రిలీజ్ డేట్ ఖరారు చేయడం హాట్ టాపిక్ అయింది.

ప్రభాస్, శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లు సుజీత్ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రమిది. దానికి ఏ మాత్రం తగ్గకుండా రూ. 250 నుంచి రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

 ముందస్తు హెచ్చరికా?

ముందస్తు హెచ్చరికా?

రిలీజ్ డేట్ దాదాపు 9 నెలల ముందే ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. ఇతర పెద్ద సినిమాలు ఏవీ ఆ రిలీజ్ డేట్ వైపు కన్నెత్తి చూడకుండా ముందస్తు హెచ్చరికగా .... ‘సాహో' నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కలిసొచ్చే హాలిడే వీకెండ్

కలిసొచ్చే హాలిడే వీకెండ్

గతంలో ఆగస్టు 15న విడుదలైన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. పైగా ఈ సారి హాలిడేతో పాటు వీకెండ్ కలిసొస్తుంది. ఇది సినిమా విడుదలకు మరింత అనుకూలం. అందుకే ఈ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

రెండేళ్ల తర్వాత ప్రభాస్..

ప్రభాస్ చివరి చిత్రం ‘బాహుబలి 2' విడుదలైన రెండేళ్ల తర్వాత ‘సాహో' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే చాలా రోజలు వెయిట్ చేసిన ఫ్యాన్స్... ఎట్టకేలకు విడుదల తేదీ ఫైనల్ అవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మూడు భాషల్లో ఇండియాలో ఇదే తొలిసారి

మూడు భాషల్లో ఇండియాలో ఇదే తొలిసారి

మూడు భాష‌ల్లో రిలీజ్ చేయ్య‌ట‌మే కాదు మూడు భాష‌ల్లో షూటింగ్ జ‌రుపుకుంటున్న త్రిభాషా చిత్రం ఇండియాలో ఇదే మెద‌టిది కావ‌టం విశేషం. ‘సాహో'ని ఓ విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకుడు సుజిత్‌తో పాటు హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

హైలెట్ అయ్యే అంశాలు

హైలెట్ అయ్యే అంశాలు

ఈ సందర్భంగా నిర్మాతలు వంశీ, ప్రమోద్ మాట్లాడుతూ... ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మా బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం సాహో. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సాహో ఫస్ట్ లుక్ రెస్పాన్స్ బావుంది. ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, సుజిత్ వరల్డ్ క్లాస్ విజన్, శ్రద్ధా కపూర్ అందచందాలు, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ టాప్ క్లాస్ మ్యూజిక్, మధి గ్రాండియర్ విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. అని అన్నారు

‘సైరా' కూడా అదే రోజున వస్తుందా?

‘సైరా' కూడా అదే రోజున వస్తుందా?

మరో వైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి' చిత్రం కూడా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది స్వాంతంత్ర్య సమరయోధుడి సినిమా కాబట్టి స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేస్తే బావుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి ‘సాహో' రిలీజ్ డేట్ ఆగస్టు 15న ఫైనల్ అయిన నేపథ్యంలో నిర్మాత రామ్ చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X