యూఎఈ, గల్ఫ్‌లో ‘సాహో’ ఆల్ టైమ్ రికార్డ్
ప్రభాస్ మూవీ 'సాహో' విడుదల ముందే పలు రికార్డులు సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ యూఏఈ, గల్ఫ్ దేశాల్లో రిలీజ్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 385 స్క్రీన్లలో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఇక్కడ ఈ స్థాయిలో విడుదల కాలేదు.
ఓమన్, కువైట్, బహ్రెయిన్, ఖాతార్, సౌదీ అరేబియాలో భారీగా విడుదల చేస్తున్నారు. హిందీలో మొత్తం 132 స్క్రీన్లు, తెలుగులో 91 స్క్రీన్లు, తమిళం 97 స్క్రీన్లు, మలయాళం 65 స్క్రీన్లలో ఈచిత్రాని విడుదల చేస్తున్నారు. సినిమాపై మంచి హైప్ ఉండటంతో వసూళ్ల పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

వరల్డ్ వైడ్ తీసుకుంటే... ఇండియా, యూఎస్ఏ, యూఏఈ, ఆస్ట్రేలియా, యూరఫ్, న్యూజిలాంటి ఇలా అన్ని ఏరియాలకు కలిపి దాదాపు 10 వేల స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇంత భారీగా విడుదలవుతున్న ఈచిత్రం వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతోందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్‌తో యూవి క్రియేషన్స్ వారు రూపొందించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, ఎవలీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











