For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాహో టీజర్: వాళ్లు నా డైహార్డ్ ఫ్యాన్స్.. అందుకే అంత వయోలెంట్‌గా.. హాలీవుడ్ స్థాయిలో ప్రభాస్

  |

  Recommended Video

  Saaho Official Teaser Telugu ||_ Prabhas ||_ Shraddha Kapoor _

  ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'సాహో' టీజర్ వచ్చేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం గురువారం 11.23 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా 'సాహో' ఉండబోతోందని టీజర్ స్పష్టం చేస్తోంది.

  ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో టీజర్‌పై హైప్ మరింత ఎక్కువైంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం నాలుగు భాషల్లో టీజర్ విడుదల చేశారు. విజువల్స్ చూస్తుంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో హై స్టాండర్డ్ మూవీ ఇదే అనే విధంగా ఉందని అంటున్నారు.

  నేను ఉన్నాను అంటూ ప్రభాస్

  నేను ఉన్నాను అంటూ ప్రభాస్

  బాధైనా, హ్యానెస్ అయినా నాతో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు అంటూ హీరోయిన్ శ్రద్దా కపూర్ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. నేను ఉన్నాను అంటూ గంభీరమైన స్వరంతో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. కట్ చస్తే టీజర్ భారీ యాక్షన్ మోడ్లోకి టర్న్ అయింది.

  వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్

  వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్

  టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ కట్ చేశారు. అబుదాబిలో చిత్రీకరించిన హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్, కార్లు, బైక్స్ చేజింగ్ సీన్స్ ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉన్నాయి. వరల్డ్ క్లాస్ విజువల్స్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం అంటున్నారు.

  వాళ్లు నా ఫ్యాన్స్, అందుకే అంత వయొలెంట్‌గా ఉన్నారు...

  టీజర్లో కేవలం ప్రభాస్ హీరోయిజం, అదిరిపోయేలా అతడి మాచో కటౌట్ చూపించడమే కాదు... ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ కొన్ని పంచీ డైలాగులు అభిమానులను ఉత్సాహ పరుస్తున్నాయి. మనపై ఎటాక్ చేస్తున్న వారు ఎవరు? అంత వయొలెంటుగా ఉన్నారు అని హీరోయిన్ అడగ్గా... వాళ్లు నా ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ టీజర్లో హైలెట్ అయింది. ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాదు, బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్ ఉంది.

  భారీ బడ్జెట్

  భారీ బడ్జెట్

  సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  సినిమాలో హైలెట్ అదే

  సినిమాలో హైలెట్ అదే

  ‘సాహో' బడ్జెట్లో ఎక్కువ శాతం(రూ. 90 కోట్లు) యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఖర్చు చేశారు. అబుదాబిలో 60 రోజుల పాటు చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలెట్ కాబోతోంది. ఈ సీన్లు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని అంటున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

  English summary
  Wednessday night, Saaho’s 1:40 minute long teaser has been previewed for a few select media personnel in Mumbai. They are raving about the Young Rebel Star’s stylish screen presence, the slick and racy action stunts involving car and bike chases shot in the UAE and the world-class visual effects.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X