షేడ్స్ ఆఫ్ ‘సాహో’ చాప్టర్ 2: హాలీవుడ్ రేంజిలో మేకింగ్, ఒళ్లు గగుర్బొడిచే సీన్లు!
బాహుబలి తర్వాత ప్రభాస్ మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు. 'సాహో' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా యు.వి క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తోంది.
అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారతదేశంలో ఉన్న సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ - 1 పేరిట గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిత్ర బృందం, ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ, 'సాహో' లో హీరోయిన్ గా నటిస్తున్న శద్ధా కపూర్ పుట్టినరోజు (మార్చి 3) సందర్భంగా 'షేడ్స్ ఆఫ్ సాహో - 2' విడుదల చేశారు.

హాలీవుడ్ రేంజిలో మేకింగ్
ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే... హాలీవుడ్ స్థాయిలో ‘సాహో' తెరకెక్కుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో వాడని ఎన్నో మేకింగ్ టెక్నిక్స్ ‘సాహో' కోసం ఉపయోగిస్తున్నారు. చాప్టర్ 2 రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

విజువల్ ఫీస్ట్
హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ త్రయం శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ‘మిర్చి' సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన మధి ‘సాహో'ను విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కిస్తున్నారు.

రూ. 300 కోట్ల బడ్జెట్, ఎవరి ఊహకు అందరి రేంజిలో
‘సాహో' సినిమా స్థాయి ఎలా ఉంటుందనేది ఎవరి ఊహకు అందడం లేదు. 300 కోట్ల బడ్జెట్, అందులోనూ రూ. 100 కోట్లకు పైగా కేవలం యాక్షన్ సీన్లకే ఖర్చు పెడుతుండటంతో హాలివుడ్ రేంజి సినిమా చూపిస్తారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
ఆగస్టు 15న విడుదల
‘సాహో' చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











