‘సాహో’ లేటెస్ట్ అప్‌డేట్: కర్జత్ వెళుతున్న శ్రద్దా కపూర్
ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సాహో'. ఈ మూవీకి సంబంధించిన షెడ్యూల్ ప్రస్తుతం మహారాష్ట్రలోని కర్జత్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి వెళుతున్నట్లు వెల్లడిస్తూ 'కర్జత్ టైమ్.. సాహో' అంటూ శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేశారు.
'సాహో'ను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రభాస్, శ్రద్ధా కపూర్‌తో పాటు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, అరున్ విజయ్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఎక్కవగా బాలీవుడ్ నటులను తీసుకున్నట్లు తెలుస్తోంది.

టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజిలో రూపొందిస్తున్నారు. ఇందుకోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కోసం హైర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇండియ్ స్క్రీన్ మీద రాని ఒక బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఇది ఉంటుందని టాక్.
శంకర్-ఎస్సాన్-లాయ్ సంగీతం అందిస్తుండగా మదీ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటంగ్, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాను మరో లెవల్లో నిలబెడతాయని చిత్ర బృందం చెబుతోంది. యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం టీ సిరిస్ సమర్పణలో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











