సాహో అప్‌డేట్: వెన్నెల కిషోర్ వచ్చేశాడు.. వెరీ ఇంట్రెస్టింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ 'సాహో'. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రలో నటించాడు. ఆయన పాత్ర పేరు గోస్వామి. సినిమా ప్రమోషన్లో భాగంగా ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ వారి ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం తాజాగా వెన్నెల కిషోర్ లుక్ రివీల్ చేసింది. ఈ పిక్‌లో ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌తో ఇంట్రెస్టింగ్ పోజిచ్చాడు వెన్నెల కిషోర్. ఈ పిక్‌ని బట్టి చూస్తే భారీ యాక్షన్ సన్నివేశాల నడుమ వెన్నెల కిషోర్ మజా చేసి ప్రేక్షకులకు వినోదం పంచుతాడని తెలుస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి 'బాహుబలి' సినిమా తరువాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఈ సినిమా తెరకెక్కించారు సాహో టీమ్. టెక్నికల్ వ్యాల్యూస్, యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సాహో రేంజ్ ఎలా ఉంటుందో ప్రేక్షక లోకానికి చెప్పేశాయి.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్ బేనర్లో వంశీ, ప్రమోద్, విక్రమ్ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. అగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‍గా ఈ మూవీ విడుదల కానుంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో ఇంకా జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్ ముఖ్య పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











