నిక్కీ గల్రానీతో విడాకులు.. ఆది పినిశెట్టి షాకింగ్ కామెంట్స్

చిత్ర పరిశ్రమలో విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి. ఎప్పుడు ఏ జంట బాంబు పేలుస్తుందో తెలియక సినీ రంగం, అభిమానులు టెన్షన్ పడుతున్నారు. నటీనటుల సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు తేడాగా , స్టేటస్‌లో ఏదైనా మార్పు కనిపించినా ఏదో జరుగుతుందని జనాలు అనుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో రకరకాల కథనాలు, గాసిప్స్ మొదలు. ప్రతినిత్యం ఇలా సెలబ్రెటీల విడాకులపై వార్తలు వస్తూనే ఉన్నాయి.

టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. వీరిలో ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ కపుల్ కూడా ఒకటి. కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట సడెన్‌గా ఓ రోజున తమ రిలేషన్ బయటపెట్టి షాకిచ్చారు. అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు నిక్కీ,ఆది. నాటి నుంచి హ్యాపీగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Sabdham Movie Hero Aadhi Pinisetty gave clarity about divorce with her wife Nikki Galrani

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస బ్లాక్ బస్టర్స్‌తో మాస్‌ను ఊపేసిన సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడే ఆది పినిశెట్టి. ఒక విచిత్రం సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా నటించాలనే గిరి గీసుకుని కూర్చోకుండా ఏ పాత్రనైనా అంగీకరించి దానికి జీవం పోస్తున్నారు. స్టైలీష్ విలన్‌గానూ తనలోని క్రూరత్వంతో ప్రేక్షకులను భయపెట్టారు ఆది. గుండెల్లో గోదారి, మలుపు, సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం, నీవెవరో, యూటర్న్, గుడ్ లక్ సఖి, క్లాప్, ది వారియర్, అజ్ఞాతవాసి వంటి సినిమాలలో ఆయన నటించారు.

ఇక నిక్కీతో ఆది లవ్ స్టోరీ విషయానికి వస్తే యాగవరాయనం నా కాక్క, మరగద నాణయం చిత్రాల్లో నిక్కీ గల్రానీతో కలిసి నటించారు ఆది పినిశెట్టి. ప్రముఖ కన్నడ నటి సంజనా గల్రానీ చెల్లెలే నిక్కీ గల్రానీ. ఈ సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారి 2022 మే నెలలో పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు. మలుపు సినిమా షూటింగ్ సమయంలో తాము ప్రేమలో పడ్డామని.. తనే నాకు ప్రపోజ్ చేసిందని ఆది చెప్పారు. అయితే కుటుంబ సభ్యులతో డిస్కష్ చేసిన తర్వాతే ప్రేమ, పెళ్లి విషయంలో కన్ఫర్మ్ చేశానని ఆయన వెల్లడించారు.

Sabdham Movie Hero Aadhi Pinisetty gave clarity about divorce with her wife Nikki Galrani

సౌత్‌లోని బిజీ ఆర్టిస్టుల్లో ఒకరిగా ఉన్న ఆది పినిశెట్టి ప్రస్తుతం శబ్ధం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 28న విడుదల కానున్న ఈ సినిమాకు అరివళగన్ దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబోలో వైశాలి అనే హార్రర్ థ్రిల్లర్ తెరకెక్కి ఘన విజయం సాధించింది. తాజాగా శబ్ధం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ.. తాను , నిక్కీ విడాకులు తీసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించారు. తొలుత ఈ న్యూస్ చూసి ఎంతో బాధపడ్డానని.. ఆ వార్తలు రాసినోడిపై రగిలిపోయానని ఆది తెలిపారు. కానీ ఇన్నేళ్ల కెరీర్‌లో, ఎన్నో సినిమాలు చేసి మెచ్యూరిటీ వచ్చిందని, ఆ తర్వాత ఇలాంటి వార్తలను వదిలేయాలని అనుకున్నానని ఆది తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X