Sunishith: ఉపాసనతో గోవాకు వెళ్లా.. కామెంట్స్ వైరల్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే?
ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలను ఏ ఒక్క మాట అన్న అస్సలు ఊరుకోరు. హీరోలు, వారికి సంబంధించిన పర్సనల్ విషయాలను అభిమానులు తమ వ్యక్తిగతంగా తీసుకుంటారు. దీంతో అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి డిఫరెంట్ గా కోటింగ్ ఇస్తుంటారు. అయితే సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ గురించి సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. యూట్యూబ్ ఇంటర్వ్యూలలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వైరల్ అవుతుంటాడు. అయితే ఎప్పటిలానే రామ్ చరణ్ సతీమణి ఉపాసనపై సునిశిత్ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు రియాక్ట్ అయ్యారు.
లావణ్య త్రిపాఠితో పెళ్లి : యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో మీమ్స్ ఫాలో అయ్యేవారికి సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ అంటే పెద్దగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోలు, వాళ్ల కుటుంబ సభ్యులు, పేరున్న రాజకీయ నేతలపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ ఫేమ్ సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతకుముందు బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠితో తనకు పెళ్లి అయిందని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో అతనిపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది.

ఉపాసనతో గోవాకు : అయితే తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెలపై ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశాడు సునిశిత్. ఇటీవ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఉపాసనకు ఆడి ఎలక్ట్రిక్ వెహికిల్ ఉంది. ఒకసారి నేను, ఉపాసన కలిసి గోవా వెళ్లి వచ్చాం" అని సునిశిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో యాంకర్ "ఇప్పుడు అభిమానులు వచ్చిన కొట్టినా కొడతారు. అవన్నీ ఎందుకు లేండి" అని అతని మాటలకు అడ్డుబడబోయింది. కానీ సునిశిత్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.

రామ్ చరణ్ నా ఫ్రెండ్ : "ఏం కొట్టరు. ఎందుకు అంటే రామ్ చరణ్ నాకు ఫ్రెండ్. ఒకసారి ఉపాసనతో చాట్ చేస్తుంటే అతనే చేయమని, ప్రేమలో పడేయమని ఫ్రెండ్లీగా చెప్పాడు" అని చెప్పుకొచ్చిన సునిశిత్ మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెలతో కూడా లాంగ్ డ్రైవ్ కు వెళ్లినట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ, సునిశిత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో మెగా అభిమానులు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు.

చితకబాదిన ఫ్యాన్స్ : తాజాగా సునిశిత్ ను ఓ అపార్ట్ మెంట్ వద్ద దొరికించుకున్న మెగా అభిమానులు అతన్ని చితకబాదారు. "మా వదిన మీద కామెంట్స్ చేస్తావా" అంటూ అతడిని గట్టిగా కొట్టారు. అంతేకాకుండా సునిశిత్ తో ఉపాసనకు, మెగా కుటుంబానికి క్షమాపణు చెప్పించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
తప్పుడు వ్యాఖ్యలు : "నమస్తే అండీ.. నా పేరు సునిశిత్. నేను ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో ఉపాసన గారిపై తప్పుడు వ్యాఖ్యలు చేశా. నాది పొరపాటు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయను. ఆ విధంగా మాట్లాడినందుకు బాధ పడుతున్నాను. ఉపాసన గారికి, రామ్ చరణ్ గారికి క్షమాపణలు" అని సునిశిత్ మాట్లాడటం ఆ వీడియోలో చూడొచ్చు.



Click it and Unblock the Notifications











