పాపం కీర్తి సురేష్ .. పెళ్ళైనా లక్ కలిసి రాలేదా.. ప్చ్
చాలా వరకు భారతీయులు పలు సెంటిమెంట్స్ ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాంటి వాటికి సినిమా రంగం వారు కూడా ఏమాత్రం అతీతం కాదు. ఈ హీరో దర్శకుడు సినిమా అంటే హిట్ అని .. ఆ హీరో ఈ హీరోయిన్ కాంబినేషన్ అంటే కనక వర్షం అని.. ఈ హీరోయిన్ ప్లాప్స్ ఉన్న హీరోతో నటిస్తే ఆ హీరోకి హిట్ పడుతుంది అని ఇలా చాలానే సెంటిమెంట్స్ మనవాళ్ళకి ఉన్నాయి.
అలాగే వీటితో పాటుగా కొంతమందికి పెళ్లయ్యాక బాగా కలిసొస్తుందనే సెంటిమెంట్ కూడా లేకపోలేదు. కానీ ఈ సెంటిమెంట్ మాత్రం ప్రముఖ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ కి ఏ మాత్రం వర్కౌట్ కాలేదు అనే టాక్ ఇపుడు వినిపిస్తుంది. కాగా ఒకప్పుడు క్రేజీ హిట్స్ అది కూడా వరుసగా చూసి స్టార్ హీరోయిన్ అయ్యిపోయిన కీర్తి సురేష్ ఇపుడు ఒక్క హిట్ కోసం నానా కష్టాలు పడుతోంది.

కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో తెలుగు సహా తమిళ్ ఇండస్ట్రీలో చేసిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్స్ అవుతూ వచ్చాయి. ఇక లాభం లేదని తొలిసారిగా ఓ హిందీ సినిమాకి ఓకే చేసింది ఈ అమ్మడు. తమిళ్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యినటువంటి "తేరి" హిందీ రీమేక్ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికయ్యారు. తన మొదటి బాలీవుడ్ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా .. ఆమె నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా బోల్డ్ షో చూస్తారని టాక్ కూడా వచ్చింది.
బాలీవుడ్ సినిమా అంటే అంతే అన్నట్టుగా కీర్తి సురేష్ కూడా అప్పుడు వరకు ఎలాంటి స్కిన్ షో చేయనప్పటికీ ఒక్కసారిగా "బేబీ జాన్" కోసం రెచ్చిపోయింది. హీరో వరుణ్ ధావన్ సరసన చాలానే హాట్ సీన్స్ అండ్ సాంగ్స్ ని కూడా చేయగా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూసింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేలోగా తన చిరకాల ప్రేమికుడు ఆంటోని తట్టిని పది రోజులు ముందే వివాహమాడింది కూడా..

అయినప్పటికీ కీర్తి సురేష్‌కి ఏ లక్ కూడా కలిసి రాలేదని చెప్పక తప్పదు. పెళ్లితో హ్యాపీ మూమెంట్స్‌తో లైఫ్ స్టార్ట్ చేసినప్పటికీ అంతే ఎనర్జీతో అందులోని హాట్ షో చేస్తూనే ప్రమోషన్స్ లో పాల్గొంది. కానీ తీరా సీన్ కట్ చేస్తే బేబీ జాన్‌ని హిందీ ఆడియెన్స్ తిరస్కరించారు. ఎంతో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వస్తాయ్ అనుకున్న ఈ సినిమా డిజాస్టర్ వసూళ్లు రాబడుతుంది.
దీనితో భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాల్లో ఆల్రెడీ టాక్ స్టార్ట్ అయ్యింది. దీనితో కీర్తి సురేష్ కి తన మొదటి హిందీ సినిమానే ప్లాప్ కాగా.. తన ప్లాప్ స్ట్రీక్ ఇంకా కొనసాగుతుంది అని చెప్పాలి. అలాగే పెళ్లి అనే సెంటిమెంట్ ఆమెకి ఏమాత్రం కలిసిరాలేదని కూడా చెప్పక తప్పదు. మరి కీర్తి సురేష్ కోరుకుంటున్న ఆ హిట్ ఎపుడు ఏ ఇండస్ట్రీ నుంచి వస్తుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











