తీవ్ర విషాదంలో శ్రీరెడ్డి.. ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు, ఇంతలోనే ఇలా!
వివాదాస్పద నటి శ్రీరెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది.. ఎప్పటికప్పుడు వివాదాస్పద అంశాలతో ఫేస్ బుక్ వేదికగా వుండే ఈ భామ గత కొద్ది రోజులుగా ఫేస్ బుక్ కి కూడా చాలా దూరంగా ఉంటుంది. దానికి కారణం ఆమె తీవ్ర విషాదంలో మునిగి పోవడం అని తెలుస్తోంది.. ఆ వివరాల్లోకి వెళితే

తీవ్ర విషాదంలో
తెలుగు లో కాస్టింగ్ కౌచ్ అనే అంశం తెర మీదకు తీసుకువచ్చిన శ్రీరెడ్డి తర్వాత కూడా చాలామందిని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలను టార్గెట్ చేసి బూతులతో విరుచుకుపడిన విషయం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.. అయితే ఈ భామ తాజాగా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

కత్తి మహేష్ తో అనుబంధం
ఆమెకు అత్యంత సన్నిహితంగా మెలిగే కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సుమారు 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరగగా దానికి చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. నిజానికి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంశం మొదలు పెట్టక ముందు నుంచే కత్తి మహేష్ కు మంచి స్నేహితురాలు అని అంటూ ఉంటారు.

డిప్రెషన్ లో
దీంతో ఆయన మరణించడంతో శ్రీ రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది అని అంటున్నారు. నిజానికి ఇప్పటికే తనకు ఇద్దరు స్నేహితులు దూరమయ్యారని ఇద్దరూ సూసైడ్ చేసుకుని మరణించారని చెబుతూ శ్రీరెడ్డి నిన్న రాత్రి పోస్ట్ పెట్టారు. ప్రస్తుతానికి తాను డిప్రెషన్ లో ఉన్నానని, త్వరలో డిప్రెషన్ నుంచి బయటపడతానని, డిప్రెషన్ నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత విషాదంలో
దీనికి తోడు ఆమెకు మంచి స్నేహితుడైన కత్తి మహేష్ మరణించడంతో ఆమె మరింత విషాదంలో మునిగిపోయారు అని తెలుస్తోంది. క్యాస్టింగ్ కౌచ్ గొడవ జరిగిన అనంతరం ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. అక్కడే ఉండి కొన్ని యూట్యూబ్ చానల్స్ రన్ చేస్తూ ఫేస్ బుక్ వీడియోల ద్వారా ఆదాయం సంపాదిస్తోంది.
Recommended Video

ప్రత్యక్ష రాజకీయాల్లోకి
మొన్నామధ్య జగనన్న తనకు అవకాశం ఇస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు, లోకేష్ లాంటి వాళ్ళకి బుద్ధి చెబుతాం అని కూడా ఆమె చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే ఇద్దరు స్నేహితులను దూరం చేసుకున్న ఆమెకు కత్తి మహేష్ కూడా దూరం కావడంతో ఆమె విషాదంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











