అమెజాన్ ప్రైమ్‌లో షాదీ ముబారక్.. సాగర్ నాయుడు మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే!
బుల్లితెర మెగాస్టార్ సాగర్ నాయుడు, దృశ్యా రఘునాథ్ జంటగా నటించిన షాదీ ముబారక్ చిత్రం సాధారణ ప్రేక్షకులనే కాకుండా సినీ విమర్శకులను మెప్పించింది. పక్కా కుటుంబ కథా చిత్రంగానే కాకుండా క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీగా ప్రశంసలు అందుకొన్నది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానున్నది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు పద్మశ్రీ తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అయ్యారు. పెళ్లిచూపులు, ప్రేమ అంశాలను కలబోసి ఈ సినిమాను ఆహ్లాదకరంగా అందించారు. ఈ చిత్రం గురువారం నుంచి అంటే మార్చి 25వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నది.
ఆస్ట్రేలియాకు చెందిన ఎన్నారై మాధవ్ పాత్రలో సాగర్ నాయుడు, మ్యారేజ్ బ్యూరో నడిపించే సత్యభామగా దృశ్య రఘునాత్ నటించారు. పెళ్లి చూపుల కోసం ఇండియా వచ్చిన మాధవ్.. సత్యభామతో ఎలా ప్రేమలో పడ్డారనే విషయాన్ని అద్యంతం వినోదభరితంగా తెరకెక్కించారు. థియేటర్లలో వచ్చిన స్పందన కంటే ఓటీటీలో మరింత రెస్పాన్స్ వస్తుందనే ఆశాభావాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది.

నటీనటులు: సాగర్ నాయుడు, దృశ్య రఘునాత్, అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్, ప్రియదర్శి రామ్, హేమంత్, శత్రు, భద్రమ్, మధునందన్, అజయ్ ఘోష్ తదితరులు
ఎడిటర్: మధు
సంగీతం: సునీల్ కశ్యప్
కెమెరా: శ్రీకాంత్ నారోజ్
నిర్మాతలు: రాజు, శిరీష్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పద్మ శ్రీ.
ఓటీటీ రిలీజ్: 2021-3-25


Click it and Unblock the Notifications











