ఐఎండీబీలో దూసుకుపోతోన్న షాదీ ముబారక్.. సాగర్ క్రేజ్ మామూలుగా లేదు!
మొగలి రేకులు ఫేమ్ సాగర్ ఆర్కే నాయుడు హీరోగా లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ మధ్యే షాదీ ముబారక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే దిల్ రాజు బ్యానర్‌పై ఈ మూవీ విడుదల కావడంతో అందరి దృష్టి పడింది. మౌత్ టాక్ బాగుండటంతో సినిమా బాగానే రన్ అవుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఐఎండీబీలో మంచి పాయింట్లతో దూసుకుపోతోంది. ఈ మేరకు చిత్రయూనిట్ గాల్లో తేలిపోతోంది.
గతవారం రిలీజ్ అయిన షాదీ ముబారక్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.1 రేటింగ్ తో టాప్ పోజీషన్‌లో నిలిచింది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా కి ప్రేక్షకులు ఆదరణ లభించింది. బుల్లితెరమీద స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సాగర్ వెండితెర పై కూడా ఈ సారి బలమైన కంటెంట్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఏ సినిమా కయినా కంటెంట్ బేస్ చేసుకొని రేటింగ్ ని అందించే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ( ఐ ఎమ్ డి బి) షాదీ ముబారక్ కు 9.1 రేటింగ్ ని అందించడం పై యూనిట్ హార్షం వ్యక్తం చేసింది.

పెళ్ళి కోసం ఇండియాకి వచ్చిన ఎన్నారై కి పెళ్ళి చూపుల్లో ఎదురైన అనుభవాలను సునిశిత హాస్యంతో మలిచారు దర్శకుడు పద్మశ్రీ. సిట్యువేషనల్‌గా వచ్చే కామెడీ తో ఫ్యామిలీ మొత్తం చూసి ఆస్వాదించతగిన విధంగా రూపొందించడంతో షాదీ ముబారక్ ఆల్ టైం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారింది. తమ కంటెంట్ కి టాప్ రేటింగ్ దక్కడం చిత్ర యూనిట్ కి కొత్త ఉత్సాహం అందించింది. సాగర్ షాదీ ముబారక్ ఇచ్చిన కిక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











