సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ స్టార్ట్.. పవన్ కళ్యాణ్‌పై మెగా మేనల్లుడి కామెంట్

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. వరుసగా ఆరు సినిమాలు డిజాస్టర్ అయినా ఏ మాత్రం వెనక్కితగ్గని ఈ హీరో ఇటీవలే 'ప్రతీ రోజూ పండగే' సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమా చేస్తూనే.. మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చాడు.

''ప్రస్థానం, ఆటోనగర్ సూర్య'' లాంటి వైవిధ్యభరిత సినిమాలకు దర్శకత్వం వహించిన దేవ కట్టా సాయిధరమ్ తేజ్ హీరోగా కొత్త సినిమా రూపొందించబోతున్నారు. భగవాన్, జె.పుల్లారావు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతు రాజ్ హీరోయిన్‌గా నటించనుంది. సాయి తేజ్ గత సినిమాలకు బిన్నంగా, కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.

Sai Dharam Tej 14 Launch: Pawan Kalyan As Special Guest

మెగా మేనల్లుడి కెరీర్‌లో 14వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ రోజే (గురువారం) లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఆయనతో పాటు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మామ పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. పవన్ ఇలా తన మూవీ ఓపెనింగ్‌కి రావడం ఆనందంగా ఉందని, ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని సాయి తేజ్ పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X