మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. నాది మాత్రం కాదంటూ..

ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పెళ్లి వేడుకలతో సెలబ్రెటీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. సినిమాల కంటే ఎక్కువగా పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలే వైరల్ అయ్యాయి. ఇటీవల మెగా డాటర్ నిహారిక. పెళ్లి కూడా గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్యామిలో పెళ్లికి రెడీ కావాల్సిన వారు ఇంకా ఉన్నారు. అందులో మెయిన్ గా సాయి ధరమ్ తేజ్ పైనే ఫోకస్ పడింది.

త్వరలోనే మరో గుడ్ న్యూస్

త్వరలోనే మరో గుడ్ న్యూస్

నిహారిక, చైతన్య జొన్నలగడ్డ పెళ్లి వేడుకను ఉదయ్ పూర్ లో గణంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరు వేడుకలో పాల్గొన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ భార్య తప్పితే మిగతా వారు అందరూ వేడుకలో పాల్గొన్నారు. ఇక మళ్ళీ ఇలాంటి వేడుకను ఎన్నటికి జరుగుతుందో అనే ఆలోచన రాకుండానే మెగా పెద్దలు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.

లిస్ట్ పెద్దగానే ఉంది..

లిస్ట్ పెద్దగానే ఉంది..

మెగా ఫ్యామిలీలో పెళ్లికి సిద్ధం కావాల్సిన వారు ఇంకా కొందరు ఉన్నారు. అందులో అల్లు అరవింద్ చిన్న కుమారుడు, అలాగే మెగా మనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. ఇక నెక్స్ట్ వీరిలో ఎవరు పెళ్లి చేసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ చిన్నవాళ్లు కానీ వారికి కూడా మూడు పదుల వయసులోకి వచ్చేశారు.

నెక్స్ట్ ఆ హీరోధే అంటున్నారు

నెక్స్ట్ ఆ హీరోధే అంటున్నారు

మూడు పదుల వయసులోకి రాకముందే పెళ్లిళ్లు చేసుకోవాలని మెగాస్టార్ యువ హీరోలకు ఎప్పుడో వివరణ ఇచ్చారు. కానీ కెరీర్ దృష్ట్యా కొందరు లేటుగా ఏడడుగులు వేస్తున్నారు. ఇక మెగాస్టార్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. ఇక నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగవచ్చని రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి.

ఇప్పట్లో నా పెళ్లి మాత్రం కాదు..

ఇప్పట్లో నా పెళ్లి మాత్రం కాదు..

ఇక ఇటీవల పెళ్లిపై సాయి ధరమ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. సోలో బ్రతుకే త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సాయి నిహారిక పెళ్లిపై స్పందిస్తూనే తన పెళ్లిపై కూడా వివరణ ఇచ్చాడు. తన పెళ్లి మాత్రం ఇప్పట్లో జరగదని అంటూ అంతకంటే ముందు మరొకరు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.

Recommended Video

#Nischay : Niharika And Chaithanya Visits Annavaram Temple | Filmibeat Telugu
వచ్చే ఏడాది అతనిదే..

వచ్చే ఏడాది అతనిదే..

వచ్చే ఏడాది అల్లు శిరీష్ పెళ్లి జరుగుతుందని అందుకు ప్లాన్స్ కూడా జరుగుతున్నట్లు వివరణ ఇచ్చారు. ఎందుకంటే శిరీష్ తనకంటే పెద్దవాడు కాబట్టి ముందు అతనిదే జరుగుతుందని ఇక నా పెళ్లికి ఇంకా సమయం ఉందని అంటూ.. ఇంకా కొన్ని పూర్తి చేయాల్సిన డ్రీమ్స్ కూడా ఉన్నాయని సాయి ధరమ్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X