ధరమ్ తేజ్ డబ్బిమన్నాడంటూ వసూళ్లు.. బీ కేర్ ఫుల్ అంటూ వార్నింగ్!
సైబర్ నేరగాళ్లు ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే రకరకాల పద్ధతుల్లో జనాన్ని దోచేయడం అలవాటు చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త పద్ధతితో దోచేయడానికి సిద్ధం అయ్యారు. తాజాగా టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ మేరకు తమ సోషల్ మీడియా ద్వారా ఒక వెల్లడించారు.. తన పేరు వాడుకుని తాను డబ్బు అడగమన్నట్లుగా తాను గతంలో పనిచేసిన వ్యక్తులను డబ్బు అడుగుతూ ఒక వ్యక్తి మెసేజ్లు పెడుతున్నాడు అని ధరమ్ తేజ్ పేర్కొన్నారు. ఇప్పటికే అతనిమీద లీగల్ యాక్షన్ మొదలు పెట్టానని ఇక మీదట అతను పెట్టిన మెసేజ్ లకు స్పందించ వద్దని సాయి తేజ్ కోరాడు.
అయితే సాయి తేజ్ తో పని చేసిన వారి నెంబర్లు ఎలా అతనికి తెలిశాయన్న వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఫోన్ హ్యాక్ చేయడం కూడా పెద్ద విషయం కాదు. సో జాగ్రత్తగా ఉండవలసిందిగా నిపుణులు సూచిస్తున్నారు. బహుశా ఆయన ఫోన్ లో ని కాంటాక్ట్ లు సేకరించిన సదరు వ్యక్తి అందులో ఉన్న కాంటాక్ట్ లకు సాయి తేజ్ పంపమన్నట్లుగా మెసేజీలు పంపుతున్నాడు అని భావిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే చివరిగా సోలో బ్రతుకే సో బెటరూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయిధరమ్ తేజ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. సినిమా నుంచి విడుదలైన టీజర్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాయి తేజ్ ఇందులో ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తుండగా ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇక కార్తీక్ దండు అనే మరో దర్శకుడికి కూడా సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రిపబ్లిక్ సినిమా పూర్తయ్యాక ఆ సినిమా అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











