Bro మూవీ నుంచి డైలాగ్ లీక్.. సాయి తేజ్‌తో పవన్ అలా అంటాడా!
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న చిత్రాల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆరంభం నుంచే అంచనాలను ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీ ఒకటి. డివోషనల్ కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు సముద్రఖని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే, దీని నుంచి వరుసగా అప్‌డేట్లు ఇస్తున్నారు. దీంతో దీనిపై హైప్ క్రమంగా పెరిగిపోతోంది.
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీ 'వినోదయ సీతమ్'కు రీమేక్‌గా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. ఆ వెంటనే వరుసగా షెడ్యూళ్లను పూర్తి చేసుకుని.. టాకీ పార్టును ఎంతో వేగంగా కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అదే సమయంలో ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలను కూడా వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ డైలాగ్ లీకైంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'బ్రో (BRO)' మూవీలో సాయి ధరమ్ తేజ్ మార్క్ అలియాస్ మార్కండేయుడి పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, పవన్ కల్యాణ్ 'కాలుడు' అనే పేరుతో కనిపించబోతున్నాడు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం పవన్ - సాయి తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయట. అంతేకాదు, ఇందులో తరచూ పవర్ స్టార్ 'మైడియర్ మార్కండేయ మంచిమాట చెబుతా రాసుకో' అని చెబుతాడట. ఈ డైలాగ్ గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమాలో మాదిరిగా ఉండడంతో ఇది కూడా హిట్టే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. 'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











