ఉమెన్స్ డే స్పెషల్ : ఎంతో నేర్పిన మహిళామణులు.. మెగా హీరోల విషెస్
మార్చి 8.. అంతర్జాతీయ మహిళ దినోత్సవం. నేడు మహిళల త్యాగాలను, నిస్వార్థంగా పంచే ప్రేమను గుర్తించాలని, వారిని గౌరవించాలని ప్రపంచమంతటా ఘనంగా సెలెబ్రేట్ చేసుకునే రోజు. మన టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం తమ జీవితంలో మహిళామణులను తలుచుకుంటూ కాస్త ఎమోషనల్ అవుతున్నారు. అఖిల్, నాగార్జున, మహేష్ బాబు వంటి హీరోలు తమ లైఫ్‌లో ఉన్న మహిళల గురించి చెబుతూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

వరుణ్ తేజ్ విషెస్..
బాక్సర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ లొకేషన్‌లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ మహిళలందరికీ విషెస్ చెప్పాడు. తన జీవితంలో ధైర్యమున్న, శక్తివంతమైన మహిళలను చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. లింగ వివక్షపై పోరాడాలంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
అమ్మ, అమ్మమ్మతో..
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు అమ్మ, అమ్మమ్మ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. తల్లి చాటు బిడ్డలా..పెరిగానని ఎన్నో సార్లు చెప్పిన సాయి ధరమ్ తేజ్ నేడు ప్రత్యేకంగా విషెస్ తెలిపాడు. అమ్మ, అమ్మమ్మతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
Recommended Video


ఎంతో నేర్పిన మహిళలకు..
‘నా జీవితంలో ఎంతో నేర్పిన సూపర్ మహిళలకు, మీ జీవితంలో మీకెంతో నేర్పిన సూపర్ మహిళలకు, మీరు సాధించిన వాటి గురించి చెప్పడానికి ఒక్క రోజు సరిపోదు.. మీ అందరికీ హ్యపీ ఉమెన్స్ డే' అంటూ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











