అనాథ పిల్లలను అవెంజర్స్ దగ్గరకు తీసుకెళ్లిన సాయి ధరమ్ తేజ్
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవల విడుదలైన హాలీవుడ్ చిత్రం 'అవెంజర్స్-ది ఎండ్ గేమ్' స్పెషల్ షో అనాథ శరణాలయం పిల్లల కోసం ఏర్పాటు చేయించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో ఈ షో ప్రదర్శించారు. పిల్లలతో కలిసి తేజ్ కూడా ఈ సినిమా వీక్షించారు.
అప్పటి వరకు తాము టీవీల్లో, తెరపై మాత్రమే చూసిన హీరో.... స్వయంగా తమ ముందుకు వచ్చి తమకు ఇష్టమైన హాలీవుడ్ సినిమా చూపించడంతో ఆ పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. షో అనంతరం చిన్నారుల కోరిక మేరకు వారితో కలిసి ఫోటోలు దిగారు.

వరుసగా 6 ప్లాపుల తర్వాత 'చిత్రలహరి'తో విజయం అందుకున్న సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి కేవలం నట వారసత్వం మాత్రమే కాదు... ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం కూడా నేర్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ పనిపై ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.
కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కిన 'చిత్రలహరి'లో సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ నటించారు. పోసాని కృష్ణ మురళి హీరోగా తండ్రిగా కీలక పాత్రలో కనిపించారు. కేవలం సినిమా మాత్రమే కాదు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా విజయం అందుకుంది.


Click it and Unblock the Notifications











