‘ఉప్పెన’లా వస్తున్నాడు: సాయి ధరమ్ తేజ్ తమ్ముడి సినిమాకు టైటిల్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తెరంగ్రేటం చేయగా... త్వరలో ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కు సిద్ధమవుతోంది.
తాజాగా ఈ చిత్రానికి ఉప్పెన అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ మూవీకి 'జాలరి' అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే చివరగా ఉప్పెన టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ చిత్రంలో హీరో మత్స్యకారయువకుడిగా కనిపిస్తారని, సముద్రం నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. ప్రముఖ తమిళ నటుడు, వైవిధ్యమైన పాత్రలతో సౌత్‌లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

మే నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్ననట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ప్రస్తుతానికి పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి తదితరులు మాత్రమే ఫైనల్ అయ్యారు. ఇతర నటీనటుల వివరాలు త్వరల వెల్లడించనున్నారు.
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సి.ఇ.ఒ: చెర్రీ
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్ సైనుద్దీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మోనిక రామకృష్ణ


Click it and Unblock the Notifications











