మన రేపటి భవిష్యత్తు కోసం, నేడు వారి త్యాగం.. మెగాహీరో ఎమోషనల్ కామెంట్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. సోషల్ మీడియాలో సెటైర్స్ వేయడమే కాదు సామాజిక సమస్యలపైనా స్పందిస్తూ ఉంటాడు. స్ఫూర్తి కలిగించే విషయాలను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా మన జవాన్ల గొప్పదనాన్ని, వారి త్యాగాన్ని కొనియాడాడు. ఈ మేరకు మెగా హీరో చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఓ వీడియోను షేర్ చేశాడు. బార్డర్‌లో మంచు కొండల మధ్య జవాన్ల జీవితాలు ఎలా ఉంటాయో చూపే ఓ దృశ్యాన్ని షేర్ చేశాడు. ఈ మేరకు ఓ కామెంట్ కూడా చేశాడు. 'ఓ జవాన్ తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. కేక్ గురించి మరిచిపోయారు.. మంచు గడ్డతో తయారు చేసిన కేక్ గురించి ఓ సైనికుడికి మాత్రమే తెలుసు.. వారి త్యాగాలను చెప్పడానికి మాటలు సరిపోవ'ని చెప్పుకొచ్చాడు.

ఆ వీడియోపై సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. 'మన రేపటి భవిష్యత్తు కోసం వారు తమ జీవితంలోని నేటిని త్యాగం చేస్తున్నారు. మన సైనికులను మనం గౌరవించాలి.. వారి కుటుంబాలు, వారు చేసే త్యాగాలను గౌరవించాలి. మన జవాన్ బర్త్ డేకు శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ సైనికుల సంతోషాన్ని తెలిపే ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బతుకు సో బెటర్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











