అందరూ సోలో బతుకే సో బెటర్ అంటున్నారట.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్

చిత్రలహరి సినిమా అప్పటి వరకు ఉన్న దురదృష్టాన్ని కాలితో తన్నేశాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. రూట్ మార్చి కమర్శియల్ ఫార్మాట్‌కు దూరంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరగా ఉన్న ప్రతిరోజు పండుగే కథను ఎంచుకుని సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాడు. డిసెంబర్ చివర్లో రిలీజ్ అయినా.. కూడా సంక్రాంతి సీజన్ వరకు వసూళ్లలో దుమ్ములేపింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.

అయితే ఇదే టెంపోను మెయింటెన్ చేస్తూ.. కొత్త ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పే పనిలో ఉన్నాడీ మెగా హీరో. కథలో కొత్తదనం ఉంటేనే ఓకే చెబుతున్న ఈ హీరో సోలో బతుకే సో బెటరు అనే ఓ చిత్రాన్ని ప్రకటించేశాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా చకచకా జరిగిపోతోంది. ఈ మేరకు ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది.

 Sai Dharam Tej Completes First Schedule Of Solo Brathuke So Better

సాయి ధరమ్ తేజ్ తాజాగా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ.. ఇక్కడ ఇంత మంది సోలో బతుకే సో బెటర్ అంటున్నారు? మరి మీరు? అంటూ ఫన్నీ పోస్ట్ చేశాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇస్మార్ట్ భామ నభా నటేష్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X