నిఖిల్ వివాహం : మరో వికెట్ పడింది.. భయం వేస్తోంది.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్

కరోనా లాంటి కష్ట కాలంలోనూ శుభకార్యాలను జరుపుకుంటున్నారు. ఇక కరోనాను అంత త్వరగా నాశనం చేయలేమని భావించి, దాంతో పాటే జాగ్రత్తగా జీవించాల్సిందేనని కాంప్రమైజ్ అయినట్టు కనిపిస్తోంది. కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ప్రపంచ దేశాలు కూడా ఇదే చెబుతోంది. మొదట్లో అన్ని కార్యకలాపాలను మూసివేసి లాక్ డౌన్‌ను పాటించగా.. తాజాగా సడలింపులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్నికార్యకలాపాలు మెల్లిమెల్లిగా మొదలవుతున్నాయి. మన సినీ తారలు కూడా ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. సమయం మించి పోతుండటంతో ప్రభుత్వ నిబంధనల మేరకు శుభకార్యాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు పెళ్లి చేసుకోగా.. తాజాగా నిఖిల్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.

లాక్ డౌన్‌తో వాయిదా..

లాక్ డౌన్‌తో వాయిదా..

హీరో నిఖిల్ వివాహానికి కరోనావైరస్ లాక్ డౌన్ అడ్డంకిగా మారింది. ఏప్రిల్‌లో జరుగాల్సిన పెళ్లి మే 14 వాయిదా పడింది. అయితే లాక్‌డౌన్ పరిస్థితులు మారే అవకాశాలు కనిపించకపోవడంతో తన పెళ్లిని నిరాడంబరంగా చేసుకోవాలని నిఖిల్ నిర్ణయించుకున్నాడు.

Recommended Video

Exclusive Pics Of Actor Nikhil Siddharth And Pallavi Marriage
 నిబంధనలకు లోబడి..

నిబంధనలకు లోబడి..

లాక్ డౌన్ నిబంధనలకు లోబడే.. వివాహా వేడుక నిరాడంబరంగా జరిగింది. పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారు. హైదరాబాద్‌కు సమీపంలోని షామీర్ పేటలోని రిసార్టు పెళ్లి వేడుకకు వేదికైంది. నేటి ఉదయం 6.31 గంటల సుముహుర్తానికి నిఖిల్, పల్లవి జంట ఒక్కటైంది.

ఫోటోలు వైరల్..

ఫోటోలు వైరల్..

నిఖిల్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను, విశేషాలను తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పాడు. ఈ మేరకు నిన్న సాయంత్రం పెళ్లి కొడుకును చేసిన ఫోటోలను షేర్ చేసి తన పెళ్లి జరుగుతోందని అధికారికంగా తెలిపాడు. కాసేపటి క్రితమే పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఇక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 మరో వికెట్ పడింది..

మరో వికెట్ పడింది..

నిఖిల్ వివాహాంపై సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘టీ టౌన్‌లో మరో వికెట్ పడింది. జీవితంలో అతి పెద్ద అడుగు వేసిన నిఖిల్‌కు కంగ్రాట్స్. నీ లైఫ్‌లో మరిన్ని హ్యాపీడేస్ రావాలి, మరింత ప్రత్యేకంగా, సరదాగా ఉండాల'ని కోరుకున్నాడు.

 బ్రహ్మాజీ కౌంటర్..

బ్రహ్మాజీ కౌంటర్..

సాయి ధరమ్ తేజ్ కామెంట్‌కు స్పందించిన బ్రహ్మాజీ.. ఎంజాయ్ చేస్తున్నావా తేజు వికెట్ పడుతుంటే అని పేర్కొన్నాడు. దీనికి ప్రతి స్పందనగా.. భయం వేస్తుంది భాజీ.. అని రిప్లై ఇస్తే.. ఆ తప్పు అసలు చేయకు.. దొరికిపోతావ్ అని బ్రహ్మాజీ మళ్లీ ఫన్నీ రిప్లై ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X