మెగా మేనల్లుడి దీపావళి సంబరాలు.. రాశిఖన్నాతో కలిసి పండగే పండగ
దీపావళి పండగ సందర్బంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రాశిఖన్నా క్రాకర్స్ కాలుస్తూ పండగ చేసుకున్నారు. వీరిద్దరితో పాటు డైరెక్టర్ మారుతి కూడా ఉన్నారు. అంతా కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ ముగ్గురూ.
ఇక ఈ ముగ్గురూ కలిసి చేస్తున్న తాజా ప్రాజెక్టు 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యరాజ్, విజయకుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. పైగా సినిమా ప్రారంభానికి ముందే ఈ సినిమా స్క్రిప్ట్ మెగాస్టార్ చూసి ఓకే చేయడం మెగా అభిమానుల్లో ఆత్రుత కలిగిస్తోంది. సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆఫ్ 'ప్రతిరోజూ పండగే'కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు చూడముచ్చటగా ఉన్నాయి. తాత మనవళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు మేకర్స్. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











