Sai Dharam Tej Health: తాజా అప్డేట్ ఇదీ.. రిపబ్లిక్ కోసం అండగా చిరంజీవి!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసింది. సుమారుగా పది రోజుల నుంచి కూడా అపోలో హాస్పిటల్ లోనే చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం గురించి మొదట్లో ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చిన అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు పూర్తిగా హెల్త్ బులిటెన్ విడుదల చేయడం ఆపేసింది. అయితే తాజాగా హాస్పిటల్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు అని అంటున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

రోడ్డు ప్రమాదం
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన బండి స్పీడ్ గా వెళ్లిందని ఒకసారి లేదు రోడ్డు మీద ఉన్న ఇసుక కారణంగా పడిపోయాడని ఒక సారి ఇలా పోలీసులు భిన్న ప్రకటనలు చేశారు. అయితే చివరికి తమ మీదకు వస్తుందని అనుకున్నారో ఏమో తెలియదు కానీ సాయిధరమ్ తేజ్ మీద ర్యాష్ డ్రైవింగ్ కింద కేసులు కూడా నమోదు చేశారు. అలాగే రోడ్డు మీద ఇసుక ఉండడానికి గల కారణమైన కంపెనీకి కూడా లక్ష రూపాయల జరిమానా విధించారు.

హుటాహుటిన
కోహినూర్ హోటల్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరగా జరిగిన వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత అక్కడ ప్రథమ చికిత్స అందుకున్న తరువాత ఆయనను చిరంజీవి కుటుంబ సభ్యులకు చెందిన అపోలో హాస్పిటల్ కి తరలించారు. అపోలో చేరినప్పటి నుంచి ఆయనకు ఇంటెన్సివ్ కేర్ అందిస్తూ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వస్తున్నారు. ముందుగా ఆయన కాలర్ బోన్ డిస్ లొకేట్ అయిన కారణంగా కాలర్ బోన్ కి సంబంధించిన సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఆయనకు వెంటిలేటర్ సపోర్టు ఊపిరి అందిస్తూ వచ్చారు.

త్వరలో డిశ్చార్జి
అయితే కొద్ది రోజుల క్రితమే ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెంటిలేటర్ కూడా తీసేస్తామని ఆయన పూర్తి స్పృహలో ఉండగా ఊపిరి కూడా స్వయంగానే తీసుకుంటున్నారని హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఇక తాజా సమాచారం మేరకు సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారని మరో రెండు మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేయబోతున్నారు అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల కాకపోయినా ఆసుపత్రి వర్గాల నుంచి ఆఫ్ ది రికార్డుగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అక్టోబర్ 1న
మరోపక్క సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ , దేవకట్టా కాంబినేషన్ లో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్' ను జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో దేవాకట్టా బిజీగా ఉన్నారు.
Recommended Video

రోడ్డు ప్రమాదం
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన బండి స్పీడ్ గా వెళ్లిందని ఒకసారి లేదు రోడ్డు మీద ఉన్న ఇసుక కారణంగా పడిపోయాడని ఒక సారి ఇలా పోలీసులు భిన్న ప్రకటనలు చేశారు. అయితే చివరికి తమ మీదకు వస్తుందని అనుకున్నారో ఏమో తెలియదు కానీ సాయిధరమ్ తేజ్ మీద ర్యాష్ డ్రైవింగ్ కింద కేసులు కూడా నమోదు చేశారు. అలాగే రోడ్డు మీద ఇసుక ఉండడానికి గల కారణమైన కంపెనీకి కూడా లక్ష రూపాయల జరిమానా విధించారు.

Click it and Unblock the Notifications