Sai Dharam Tej Health Bulletin: తేజ్ ఆరోగ్యం గురించి కీలక ప్రకటన.. ఊపిరి తీసుకుంటున్నారు.. కానీ?
కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయం నుంచి సినీ ప్రముఖులు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆయన హెల్త్ అప్డేట్ రాలేదు. తాజాగా కొద్ది సేపటి క్రితం ఆయన హెల్త్ అప్డేట్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

తేజ్ ప్రమాదం
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి జరిగిన బైక్ యాక్సిడెంట్ లో సాయి ధరమ్ తేజ్ కు కాలర్‌బోన్‌కు ఫ్రాక్చర్ అయ్యింది. అలాగే ఛాతీ మరియు కడుపుపై కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే హాస్పిటల్ కు తీసుకు రావడం వలన పెను ప్రమాదం తప్పిందని వైద్యులు క్లారిటీ ఇచ్చారు కూడా.

ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తూ
ముందు మెడి కవర్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించినా తర్వాత అపోలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసనకు సంబంధించిన హాస్పిటల్ కావడంతో మొదటి రోజు నుంచి కూడా అపోలో వైద్యులు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ ఎప్పటికప్పుడు వైద్యులకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

తేజ్ ఆరోగ్యం నిలకడగా
అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని మొదటి రోజు నుంచి కూడా అపోలో వైద్యులు హెల్త్ విషయం పై అప్డేట్స్ ఇస్తున్నారు. తప్పకుండా సాయి త్వరగా కోలుకుంటారని ధైర్యం చెబుతున్నారు. హీరో సాయిధరమ్ తేజ్ సర్జరీ సక్సెస్ అయ్యిందని కొద్ది రోజుల క్రితం బులెటిన్ లో ప్రకటించారు. అయితే కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అంటూ.. ఒక ప్రకటన చేశారు.

వైద్యులు ఏమన్నారంటే?
''హీరో సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారు, ఆయనకు వెంటిలేటర్‌ను తొలగించారు మరియు సొంతంగానే ఆయన శ్వాస తీసుకుంటున్నారు. మరికొద్ది రోజులు ఆయన హాస్పిటల్‌లోనే కొనసాగుతారు..'' అని హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్‌పై అపోలో హాస్పిటల్స్ తాజా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే సాయిధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.

త్వరగానే
ఈ ప్రమాదం తర్వాత అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకుంటున్న సాయితేజ్‌ను పలువురు ప్రముఖులు సైతం వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు, మెగా ఫాన్స్, తేజ్ శ్రేయోభిలాషులు కోరుకుంటూ ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనలు ఫలించి సాయితేజ్ త్వరగా కోలుకున్నారనే చెప్పచ్చు. ఇక తాజా ప్రకటన మేరకు తాజా హెల్త్ అప్‌డేట్ ప్రకారం.. త్వరలోనే ఆయన నార్మల్ పరిస్థితికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. .


Click it and Unblock the Notifications











