Sai Dharam Tej Health Bulletin: నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం, అపోలో వైద్యులు చెప్పిన విషయం ఏమిటంటే?
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ బైక్‌పై వేగంగా వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్‌లో చికిత్ పొందుతున్న సంగతి తెలిసిందే. జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఆయనకు క్రిటికల్ కేర్ విభాగంలోని అత్యుత్తమ వైద్యబృందం చికిత్సను అందిస్తున్నారు. అయితే శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
అపోలో హాస్పిటల్‌లోని క్రిటికల్ కేర్ విభాగంలో సాయిధరమ్ తేజ్‌కు చికిత్స జరుగుతున్నది. న్యూరోసర్జన్ డాక్టర్ అలోక్ రంజాన్, క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి, పాలమనాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్, ఆర్థోపెడిక్స్ సర్జన్ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డితో కూడిన బృందం ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు.

అపోలో వైద్యుడు అలోక్ రంజన్ పర్యవేక్షణలో విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 34 సంవత్సరాల సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో అపోలో జూబ్లిహిల్స్‌లోని చేరారు. ఆయన ప్రధాన అవయవాలు నిలకడగా పనిచేస్తున్నాయి. శరీరంలోపల ఎలాంటి బ్లీడింగ్ లేదు. వైద్యులు చికిత్సకు పూర్తిగా రెస్పాండ్ అవుతున్నారు. భుజంలోని విరిగిన ఎముక సర్జరీ చేయాలా? వద్దా? అనేది 24 గంటల తర్వాత నిర్ణయం తీసుకొంటాం అని బులెటిన్‌లో వెల్లడించారు.
ఇదిలా ఉండగా, సాయిధరమ్ తేజ్ ప్రమాద ఘటనపై పోలీసులు తమ రిపోర్టును వెల్లడించారు. యాక్సిడెంటల్‌గానే జరిగింది. ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ మద్య సేవించలేదు. కానీ మితిమీరిన వేగంతో బైక్ నడిపారనే విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు.
ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై సాయిధరమ్ తేజ్‌పై గచ్చిబౌలిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇండియన్ వెహికల్ యాక్ట్ కింద ఆయనపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఐపీసీ సెక్షన్ 336 సెక్షన్, 184 వెహికిల్ యాక్ట్ ప్రకారం సాయిధరమ్ తేజ్‌పై కేసు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











