మెగా ఇంట పండగ వాతావరణం.. చిరంజీవిపై ముద్దుల వర్షం.. వైరల్ పిక్స్

ప్రపంచమంతా కళ్ళలో ఒత్తులు వేసుకొని చూసిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం, సెన్సేషనల్ హిట్ టాక్ తెచ్చుకోవడం రెండూ చకచకా జరిగిపోయాయి. దీంతో మెగా అభిమానలోకం సంబరాల్లో మునిగితేలుతోంది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురిపిసితున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది. తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మెగా ఇంట చేరి సందడి చేశారు. ఆ వివరాలు చూద్దామా..

చిరంజీవి ఇంట్లో ఆడపడచు సందడి

చిరంజీవి ఇంట్లో ఆడపడచు సందడి

సైరా సక్సెస్ సందర్బంగా మెగాస్టార్ ఇంట్లో ఆడపడచు సందడి చేసింది. పిల్లలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో కలిసి మెగా ఇంటికి చేరి సంబరాలు చేసింది.
సాయి ధరమ్ తేజ్ అయితే మేనమామ చిరంజీవిని ముద్దుల్లో ముంచెత్తాడు. తాజా ఇందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ మెగాస్టార్‌కి అభినందనలు తెలిపాడు మెగా మేనల్లుడు.

మై హీరో.. జీవించేశారు

మై హీరో.. జీవించేశారు

చిరంజీవి నా యొక్క ప్రత్యేక అభినందనలు. అల్లుడిగా కాదు.. ఓ ఫ్యాన్‌గా అంటూ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పెట్టేశాడు సాయి ధరమ్ తేజ్. తాను చిన్నప్పటి నుంచే మెగాస్టార్ వెండితెర మ్యాజిక్ చూస్తున్నానని చెప్పిన ఆయన.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి క్యారెక్టర్‌లో జీవించేశారని పేర్కొన్నాడు. దీనిపై 'మై హీరో' అనే హాష్ ట్యాగ్ జత చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు సాయి ధరమ్ తేజ్.

Recommended Video

Chiranjeevi Speech At Sye Raa Narasimha Reddy Success Meet | మహేష్ బాబు,రాజమౌళి కి చాలా నచ్చింది!!
హోరెత్తిపోయిన కామెంట్లు.. వర్షం కురిసింది

హోరెత్తిపోయిన కామెంట్లు.. వర్షం కురిసింది

సైరా సక్సెస్ సందర్బంగా మెగా ఫ్యామిలీలో నెలకొన్న ఈ సందడి వాతావరణం చూసి మురిసిపోతున్నారు మెగా అభిమానులు. సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ చేస్తూ వాటిని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఎత్తున అభినందనల వర్షం కురిపించారు నెటిజన్లు.

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. చిత్రంలో అందరి నటనకూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రతీ రోజు పండుగే.. చిరు సహకారం

ప్రతీ రోజు పండుగే.. చిరు సహకారం

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ప్రతీ రోజు పండుగే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై తెరకెక్కుతోంది 'ప్రతీ రోజు పండుగే' మూవీ. బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మామ మెగాస్టార్ చిరంజీవి కూడా పరిశీలించి ఓకే చేశారు. దీంతో చిత్రాన్ని అన్ని హంగులు జోడించి చిరంజీవి అంచనాలను రీచ్ అయ్యేలా నిర్మిస్తున్నారు డైరెక్టర్ మారుతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X