ఆసక్తికర టైటిల్‌‌తో మెగా మేనల్లుడి కొత్త సినిమా షురూ

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభమైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ముహూర్తపు కార్యక్రమాలు ఈ రోజు ఉదయం 9 గంటల 26 నిమిషాలకు హైదరాబాద్ లో మొదలు పెట్టారు. 'ప్రతీ రోజూ పండగే' అనే ఆసక్తికర టైటిల్ కన్ఫర్మ్ చేశారు. హీరోహీరోయిన్స్ సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నాలపై తొలి షాట్‌కి ప్రముఖ నిర్మాత క్లాప్ కొట్టారు.

అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మామ మెగాస్టార్ చిరంజీవి కూడా పరిశీలించి ఓకే చేశారు. దీంతో చిత్రాన్ని అన్ని హంగులు జోడించి చిరంజీవి అంచనాలను ఏ మాత్రం వమ్ము చేయకూడదని భావిస్తున్నారు డైరెక్టర్ మారుతి.

Sai Dharam Tej Movie Start With Intresting Title

గతంలో సుప్రీమ్ సినిమా ద్వారా సాయి ధరమ్, రాశీ ఖన్నా జోడీ సక్సెస్ సాధించింది. అదే కోవలో 'ప్రతీ రోజూ పండగే' కూడా ఈ జోడీకి మంచి సక్సెస్ తెచ్చిపెడుతుందని అంటున్నారు దర్శకనిర్మాతలు. ఇక కథ ప్రకారం ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ కి కూడా ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం నేల టిక్కెట్టు భామ మాళవిక శర్మ, రుక్సార్ థిల్లాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. మొదట ఈ చిత్రానికి 'భోగి' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందుకు కాస్త దగ్గరగానే 'ప్రతీ రోజూ పండగే' అనే క్లాసీ టైటిల్‌తో ఆకట్టుకున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X